ఇండియా(India)లో 70 ఏళ్ల కింద అంతరించిపోయిన చీతాల(Cheetah)ను మళ్లీ వృద్ధి చేయాలని కేంద్రం భావించింది. ఈ నేపథ్యంలో ఇటీవలె నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి పలు చీతాలను ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వాటిని మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ అభయారణ్యంలో వదిలి పెట్టి సంరక్షించారు. అయితే ఈ చీతాలు ఇప్పుడు వరుసగా మృత్యువాత పడుతున్నాయి.
ఇటీవలె దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన రెండు చీతాలు మరణించాయి. తాజాగా ఓ ఆడ చీతా కూడా చనిపోయింది. కొన్ని నెలల కాలంలోనే మూడు చీతాలు(Cheetah) చనిపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. మొదటగా నమీబియాకు చెందిన సాషా అనే చీతా చనిపోయింది.
సాషా అనేది ఆడ చీతా. ఆ చీతా(Cheetah) వయసు ఆరేళ్లు మాత్రమే. దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో ఆ చీతా మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన చీతాకు పోస్టుమార్టం చేయగా ఈ విషయం తెలిసింది. సాషా చీతా తర్వాత దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్ అనే మగ చీతా కూడా మృతిచెందింది. నరాలు, కండరాల సమస్యలతో ఆ చీతా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా మూడో చీతా(Cheetah) కూడా చనిపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.