ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా అరటి పండ్లు తినాలని చాలామంది అంటారు. అరటిపండ్లను తింటే గుండె బలపడుతుంది. ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్తారు. తక్షణ శక్తి అందడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారు. కానీ అరటిపండును రోజూ తినడం సేఫేనా? అసలు కిడ్నీ జబ్బులు ఉన్న వారు అరటిపండ్లు తినవచ్చా తెలుసుకుందాం.
Banana : ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా అరటి పండ్లు(Banana) తినాలని చాలామంది అంటారు. అరటిపండ్లను తింటే గుండె(Heart) బలపడుతుంది. ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్తారు. తక్షణ శక్తి అందడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల(health benefits)ను కూడా పొందుతారు. కానీ అరటిపండును రోజూ తినడం సేఫేనా? అసలు కిడ్నీ జబ్బులు(Kidney diseases) ఉన్న వారు అరటిపండ్లు తినవచ్చా తెలుసుకుందాం. పండ్లలో విటమిన్లు(Vitamins), ఖనిజాలు, ప్రోటీన్లు(proteins) పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు పండ్లను తినాలని సలహానిస్తుంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని పండ్లు కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అందులో అరటిపండు ఒకటి. మోతాదుకు మించి అరటిపండును తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరటిపండును ఒకటి కంటే ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం శరీరానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది మూత్రపిండాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
కిడ్నీ పేషెంట్లు(Kidney patients) దాదాపు అరటిపండ్లను తినడం మానేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒక మీడియం సైజ్ అరటిపండులో 9శాతం లేదా 422 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది. రక్తంలో పొటాషియం(Potassium) పరిమాణం 3 నుంచి 5 MEQ వరకు మాత్రమే ఉండాలి. ఇది అంతకంటే ఎక్కువైతే రక్తంపై దుష్ప్రభావం చూపుతుంది. రోజుకు రెండు కంటే ఎక్కువ మీడియం సైజు అరటిపండ్లను తినకూడదు. ఎందుకంటే మనం రోజంతా బంగాళాదుంపలు(Potatoes), పాలకూర, దానిమ్మ వంటి అనేక ఇతర వస్తువులను తింటాం. వాటిలో పొటాషియం తగిన మోతాదులో ఉంటుంది. శరీరానికి హాని కలగకుండా ప్రతి ఆహార పదార్థాన్ని నిర్ణీత పరిమాణంలోనే తినాలి.
అరటిపండ్లు ఎవరు తినకూడదు?
కడుపులో మంట(Acidity) ఉన్నవారు అరటిపండ్లను తినకూడదు. ఎందుకంటే అరటిపండు ఎసిడిటీని పెంచుతుంది. అలాగే గర్భధారణ(pregnancy) సమయంలో అరటిపండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల అలర్జీ సమస్యలు వస్తాయి. ఎందుకంటే అరటిపండ్లలో లేటెక్స్ అనే పదార్థం ఉంటుంది. ఇవి అలెర్జీ(allergy)లకు కారణమవుతాయి. గర్భిణులు అరటిపండు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. అరటిపండ్లలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. అవి బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే బరువు ఎక్కువున్న వారు వీటిని తినకపోవడమే మంచిది.
అరటిపండ్లలో ఉండే పోషకాలు
అరటి పండ్లలో కార్బోహైడ్రేట్(Carbohydrate), విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి -6, కాల్షియం, సోడియం, ఐరన్, జింక్, పొటాషియం వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటుగా గ్లూకోజ్(Glucose), ఫ్రక్టోజ్ కూడా ఉంటాయి. మీరు కిడ్నీ పేషెంట్ అయితే డాక్టర్ సలహా మేరకు మాత్రమే అరటిపండ్లు తినండి. జిమ్, మార్నింగ్ వాక్, వర్కౌట్స్, ఎక్సర్ సైజ్ ల తర్వాత రెగ్యులర్ గా అరటిపండ్లు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇందులో విటమిన్ బి6 ఉంటుంది. ఇది శరీర బలాన్ని, మానసిక బలాన్ని పెంచడానికి పని సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. వీటితో పాటు బరువు పెరగడం, ఒత్తిడి, నెలసరి నొప్పి, గుండె సమస్యలు, నిద్ర సమస్యలకు అరటి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది.