»Iphone Maker Foxconn Buys Huge Site In Bengaluru For 13 Million
iPhone: బెంగళూరులో ఐఫోన్ తయారీ కంపెనీ..?
బెంగళూరు నగరంలో ఐఫోన్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టనున్నారా? అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ బెంగళూరు శివార్లలో భారీ భూమిని కొనుగోలు చేసింది. దాదాపు 300 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం గమనార్హం. ఈ విషయాన్ని లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలియజేసింది.
యాపిల్ ఐఫోన్ల అసెంబ్లింగ్‌ను చేపడుతున్న ప్రధాన కంపెనీల్లో ఫాక్స్‌కాన్ ఒకటి. ఈ సంస్థ ప్లాంట్ ను ఇండియాలో పెట్టాలని అనుకుంది. యాపిల్ కూడా మేడిన్ ఇండియా యాపిల్ ఫోన్లను భారీగా తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఫాక్స్ కాన్ అనేక రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపింది. హైదరాబాద్ లోనూ ఈ ప్లాంట్ పెట్టాలని అనుకున్నారు. కానీ, చివరకు బెంగళూరులో స్థలాన్ని కొనుగోలు చేయడం గమనార్హం. ఈ భూమిని కొనుగోలు చేసిన కంపెనీ అధికారిక పేరు హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ.
కర్ణాటకలో బెంగళూరు ఎయిర్ పోర్టుకు సమీపంలో దేవనహళ్లి దగ్గర మూడు వంద ఎకరాలు అనుబంధ సంస్థ ద్వారా కొనగోలు చేసినట్లుగా లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు ఫాక్స్ కాన్ తెలిపింది. బెంగళూరులో ల్యాండ్ కొనుగోలు చేసిన అనుబంధ కంపెనీ పేరు ఫాక్స్ కాన్ హాన్ హాయ్ టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్మెంట్ కంపెనీ ఈ స్థలం కొనుగోలు చేసింది. బెంగళూరులో స్థలం కొనుగోలు పూర్తయ్యింది కాబట్టి, ఇక తెలంగాణలో మళ్లీ కొనుగోలు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక్కడ కొనడానికి ముందు నగరంలో కొనుగోలు చేయడానికి చర్చలు జరిపారు. కానీ, కొనుగోలు జరగలేదు. దీంతో హైదరాబాద్ కి రావాల్సిన ఛాన్స్ బెంగళూరుకు వెళ్లినట్లు తెలుస్తోంది.