• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్ లో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. రేపటి నుంచి తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి రేపు మధ్యాహ్నం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గతంలో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9 గ...

February 2, 2023 / 02:47 PM IST

ముజాహిదీన్‌లను సృష్టించి తప్పు చేశాం: పాక్ మంత్రి సంచలనం

పెషావర్ మసీదు లోపల తమ భద్రతా దళాలపై ఘోర తీవ్రవాద దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. దేశ ఇంటర్నల్ మినిస్టర్ రాణా సనావుల్లా జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ… ముజాహిదీన్‌లను ప్రపంచ శక్తితో యుద్ధానికి సిద్ధం చేయడం తాము చేసిన అతిపెద్ద పొరపాటు అన్నాడు. ముజాహిదీన్‌లను సృష్టించి పాక్ తప్పు చేసిందన్నాడు. మనం ముజాహిదీన్‌లను సృష్టించాం… ఇప్పుడు ఆ టెర్రరిస్టులు మనకే ఉగ్రవాదులు అయ్...

February 2, 2023 / 02:16 PM IST

దయతో ఆనంకు జగన్ ఛాన్స్ ఇచ్చారన్న నేదురుమల్లి

రాష్ట్ర ప్రభుత్వంపై వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో తాము పని చేస్తేనే ఆయన గెలిచాడని, జగన్ ఆయనకు దయతలిచి టిక్కెట్ ఇచ్చారని ధ్వజమెత్తారు. గెలిచిన మొదటి ఏడాది నుండే ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజల మీద రుద్దాలని చూసే ప్రయత్నం సరికాదన్నారు. తన...

February 2, 2023 / 01:53 PM IST

ఉద్యోగాల కోసం ఎదురు చూడొద్దన్న కేటీఆర్!!

మన దేశంలో ఆర్థిక అభివృద్ధి కంటే రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడతారని, అలాంటి పరిస్థితి మారాలని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడటం కాదని, ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలన్నారు. NHRD ఆధ్వర్యంలో నిర్వహించిన డీకోడ్ ది ఫ్యూచర్ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్‌లో చాలా తెలివైనవారు, ఎంతో గొప్పవారు నాయకులు ఉన్నారని, కానీ చాలామంది మెరుగైన ఆర్థిక ...

February 2, 2023 / 01:02 PM IST

నెలలో 37 లక్షల వాట్సాప్ అకౌంట్స్ నిషేధం, ఇలా చేయండి

మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్… భారత్‌లో గత ఏడాది డిసెంబర్ 1వతేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు… అంటే నెల రోజుల్లో 36,77,000 ఖాతాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఐటీ నియమం 202ను ఉల్లంఘించిన వినియోగదారులపై వాట్సాప్ మెసేజింగ్ యాప్ నిషేధాస్త్రం విధించింది. ఇందులో 13,89,000వాట్సాప్ వినియోగదారుల నుండి ఎలాంటి నివేదికలు రాకముందే ఆయా ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది. ...

February 2, 2023 / 12:06 PM IST

హుజురాబాద్ నుండి నేనే, కేటీఆర్ అదే చెప్పారు: కౌశిక్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుండి భారత రాష్ట్ర సమితి(BRS) అభ్యర్థిని తానేనని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని మంగళవారం చెప్పారని గుర్తు చేశారు. కౌశిక్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్ చేతిలో ఓడిపోయాడు. 2021 జూలైలో ఆ పార్టీకి రాజీనామా చేసి, అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. 2020లో జరిగి...

February 2, 2023 / 11:39 AM IST

పల్లెలు To పట్టణం: ‘వందే భారత్’ కు మినీ వర్షన్ ‘వందే మెట్రో’

దేశంలోని ప్రధాన పట్టణాల మధ్య రవాణా సమయం తగ్గించేందుకు రైల్వే శాఖ వందే భారత్ రైళ్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వందే భారత్ రైళ్లకు మినీ వర్షన్ గా ‘వందే మెట్రో’ రైళ్లు రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు. ప్రధాన పట్టణాలకు సమీప ప్రాంతాల నుంచి వేగంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వందే మెట్రో రైళ్లు తీసుకురా...

February 2, 2023 / 11:16 AM IST

ఒక్కొక్కరిని కాదు… పవన్ ఆహాకు సర్వర్ క్రాష్ సమస్య ఉండదట

బాలకృష్ణ హోస్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా… అన్‌స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు, ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ నేడు రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ప్రోమోలు అన్నీ కూడా బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అనేవిధంగా అదరగొట్టాయి. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్‌కు సర్వర్ క్రాష్ సమస్యను ఎదుర్కొంది. పవన్ ఎపిసోడ్ నేపథ్యంలో ఆహా టీమ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న...

February 2, 2023 / 12:08 PM IST

మద్యం తాగుతున్నారా.. లివర్ బాగుండాలంటే ఇలా చేయండి

మద్యం తాగే అలవాటు లేనివారు చాలా తక్కువ. ఎక్కువ మంది ఏదైనా అకేషన్ సందర్భంగా తీసుకుంటారు. కానీ కొంతమంది మద్యం లేకుండా ఒకరోజు కూడా ఉండలేరు. అధిక మద్య సేవనం వల్ల కాలేయం దెబ్బతింటుంది. మనం సజీవంగా ఉండేందుకు సహాయపడే 500కు పైగా ముఖ్య విధులను కాలేయం నిర్వహిస్తుంది. అవసరమైనప్పుడు శీఘ్రశక్తిని ఇవ్వడం, గ్లుకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచడం, శరీరం నుండి విషపదార్థాలు తొలగించడం, ఇన్పెక్షన్‌తో పోర...

February 2, 2023 / 10:03 AM IST

పరీక్ష హాల్లో అమ్మాయిల్ని చూసి స్పృహతప్పి పడిపోయాడు

పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థి హాలులోకి ఎంటర్ కాగానే, అక్కడ తాను తప్ప అందరూ అమ్మాయిలు ఉండటం చూసి స్పృహ తప్పి పడిపోయిన సంఘటన బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో చోటు చేసుకున్నది. ఇక్కడి ఇక్బాల్ కాలేజీ 17 ఏళ్ల విద్యార్థి మనీష్ శంకర్ ప్రసాద్ ఇంటర్ పరీక్ష మ్యాథ్స్ రాయడానికి బ్రిలియంట్ కాన్వెట్ స్కూల్‌కు వెళ్లాడు. ఎగ్జామ్ హాలులోకి వెళ్లగానే, 50 మంది వరకు అమ్మాయిలు ఉన్నారు. తానొక్కడే అబ్బాయి. అమ...

February 2, 2023 / 09:19 AM IST

సీఎం ఎక్కడుంటే అదే రాజధాని, పవన్‌కు రాసిస్తా: అమర్నాథ్

త్వరలో విశాఖపట్నం భవిష్యత్తు మారుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సంబంధించి ఢిల్లీలో జరిగిన సన్నాహక సదస్సు వివరాలను వెల్లడించారు. 49 దేశాలకు చెందిన ప్రతినిధులు, అసోచామ్, ఫిక్కీ, సీఐఐ, నాస్కామ్ ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు. రాష్ట్రంలో...

February 2, 2023 / 08:48 AM IST

తెలంగాణకు తీరని అన్యాయం.. 9 ఏళ్లుగా ఇదే మోదీ ధోరణి

కొత్త రాష్ట్రం తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయమే చేస్తోంది. చేదోడు ఇవ్వాల్సిన కేంద్రం చేతులు విరిచేలా ప్రవర్తిస్తోంది. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు దక్కిన ప్రయోజనం ఒక్కటంటే ఒక్కటీ లేదు. ఒక్క చోట కూడా తెలంగాణ అనే పదం బడ్జెట్ ప్రసంగంలో వినిపించలేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించింది. అలాంటి రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాల్సి ఉంద...

February 2, 2023 / 07:55 AM IST

పేదల గురించి రెండుసార్లే ప్రస్తావించారు: బడ్జెట్‌పై చిదంబరం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పైన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో కేవలం రెండుసార్లు మాత్రమే పేదల ప్రస్తావన తెచ్చారన్నారు. ప్రజలు, వారి ఆందోళనలను ఏమాత్రం మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఏ మాత్రం కనికరం లేని బడ్జెట్ ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారన్నారు. 90 నిమిషాల ప్రసంగంలో నిరు...

February 2, 2023 / 07:21 AM IST

దుబాయ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక.. ఏం చేస్తున్నారో చూడండి

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పాన్ ఇండియా స్టార్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇద్దరూ లవ్ బర్డ్స్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇద్దరి మధ్య నిజంగా లవ్ ఉందో లేదో తెలియదు కానీ.. ఈ ఇద్దరు మాత్రం ప్రస్తుతం చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. నిజానికి వీళ్లిద్దరూ కలిసి నటించింది రెండు సినిమాల్లోనే. కానీ.. వీళ్ల జంట ఆన్ స్క్రీన్ మీద బాగా వర్కవుట్ అయింది. గీత గోవిందం...

February 1, 2023 / 09:41 PM IST

మూడు రాజధానులే, ఫోన్ ట్యాపింగ్ నాటకం: కొడాలి నాని

తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని మాజీ మంత్రి కొడాలి నాని బుధవారం స్పష్టం చేశారు. విశాఖ రాజధాని అని, అక్కడకు తాను షిఫ్ట్ అవుతున్నానని జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు మూడు రాజధానులపై స్పందిస్తున్నారు. జగన్ ఢిల్లీలో కొత్తగా ఏమీ చెప్పలేదని, ఎప్పుడూ చెప్పేదే చెప్పారన్నారు. సుప్రీం కోర్టు కూడా తమకు రాజధానిపై శాసనాధికారం లేదంటే, కేంద్రం ప్రభుత్వంతో బిల్లు...

February 1, 2023 / 08:44 PM IST