మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్… భారత్‌లో గత ఏడాది డిసెంబర్ 1వతేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు… అంటే నెల రోజుల్లో 36,77,000 ఖాతాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఐటీ నియమం 202ను ఉల్లంఘించిన వినియోగదారులపై వాట్సాప్ మెసేజింగ్ యాప్ నిషేధాస్త్రం విధించింది. ఇందులో 13,89,000వాట్సాప్ వినియోగదారుల నుండి ఎలాంటి నివేదికలు రాకముందే ఆయా ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్‌లలో దుర్వినియోగాన్ని నిరోధించడంలో వాట్సాప్ పరిశ్రమలోనే అగ్రగామిగా ఉందని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. తమకు 1607 మంది వినియోగదారుల నుంచి అప్పీళ్లు వచ్చాయని వెల్లడించింది. వాట్పాప్ కు 2021 ఫిబ్రవరి నాటికి భారతదేశంలో 53 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు.
వాట్సాప్ వినియోగదారులు తమ అకౌంట్ బ్యాన్ కాకుండా ఉండాలంటే నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా ఈ ఐదింటిని అనుసరించాలి. పైరేటెడ్ కంటెంట్‌ను పంపించడం మానుకోవాలి. వాట్సాప్ పోటోలు, స్టిక్కర్లు వినియోగిస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. థర్డ్ పార్టీ వర్షన్‌ను ఉపయోగించడం మానుకోవడం మంచిది. ఉపయోగించినా… క్రాస్ చెక్ చేసుకోవాలి. తరుచూ రిపోర్ట్‌కు దూరంగా ఉండాలి. స్పామ్ పంపించడం, మరొకరిని హ్యాకింగ్ చేసే ప్రయత్నాలకు దూరంగా ఉండాలి.