పెషావర్ మసీదు లోపల తమ భద్రతా దళాలపై ఘోర తీవ్రవాద దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. దేశ ఇంటర్నల్ మినిస్టర్ రాణా సనావుల్లా జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ… ముజాహిదీన్లను ప్రపంచ శక్తితో యుద్ధానికి సిద్ధం చేయడం తాము చేసిన అతిపెద్ద పొరపాటు అన్నాడు. ముజాహిదీన్లను సృష్టించి పాక్ తప్పు చేసిందన్నాడు. మనం ముజాహిదీన్లను సృష్టించాం… ఇప్పుడు ఆ టెర్రరిస్టులు మనకే ఉగ్రవాదులు అయ్యారని సభలో ఆందోళన వ్యక్తం చేశాడు. ఉగ్రవాద దాడులతో తాము పడుతున్న ఇబ్బందులను ప్రపంచ దేశాలు గుర్తించడం లేదని మరో మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. ఉగ్ర దాడుల కారణంగా పాకిస్తాన్కు ఇప్పటి వరకు దాదాపు 12600 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందన్నారు. మసీదులో ఆత్మాహుతి దాడిపై పారదర్శకంగా విచారణ జరపాలన్నారు. పెషావర్ మసీదులో ఉగ్రదాడి కారణంగా ఇప్పటి వరకు 100కు పైగా మృతి చెందారు. ఇందులో 97 మంది సెక్యూరిటీ సిబ్బందే.