• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వైభవంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రతిష్ట

కృష్ణా: అవనిగడ్డ గుర్రపు చెరువు వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. గర్భాలయంలో అమ్మవారు, ఆలయం ఎదుట ధ్వజస్తంభ ప్రతిష్ట వేద పండితులచే జరిపించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవంలో భాగస్వాములయ్యారు.

February 22, 2026 / 05:01 PM IST

కారును తప్పించబోయి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆటో

KNR: శంకరపట్నం నుంచి వీణవంక వైపు వస్తున్న ఎలక్ట్రిక్ ఆటో ఆదివారం ప్రమాదానికి గురైంది. ఆముదాలపల్లి వద్ద ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి నియంత్రణ కోల్పోయిన ఆటో, రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ చింతల సంపత్కు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో ముందు భాగం పాక్షికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.

February 22, 2026 / 05:01 PM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్సై

KKD: రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాలను సామర్లకోట ఎస్సై రాజా ఆదివారం పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి స్టేషన్ సిబ్బందితో కలిసి సామర్లకోట పట్టణంలో గల పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 05:00 PM IST

‘దూబచర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి’

E.G: దొంగతనాలతో దూబచర్ల గ్రామ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని, దొంగతనాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని CITU జిల్లా నాయకులు కొక్కిరిపాటి వెంకట్రావు ఆదివారం విమర్శించారు. బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల మొబైల్ ఫోన్స్, ఇళ్లలోని విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయని ఆయన చెప్పారు. ఈ మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

February 22, 2026 / 05:00 PM IST

ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

కోనసీమ: రేపటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షల కోసం కోనసీమ వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా ఆదివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, విద్యార్థులు నిమిషం నిబంధనను పాటిస్తూ 10 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులందరూ ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి విజయం సాధించాలన్నారు.

February 22, 2026 / 05:00 PM IST

గంగాణమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

GNTR: పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ గంగాణమ్మ తల్లి దేవస్థానం 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అమ్మవారికి పూజలు చేసి పూజా సామాగ్రి గదిని ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

February 22, 2026 / 04:59 PM IST

స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

మేడ్చల్: శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకింపేట స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్‌లో 7వ తరగతి విద్యార్థి శ్రీనాథ్ ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆదివారం హాస్టల్ గదిలో విద్యార్థి ఉరివేసుకున్న స్థితిలో కనిపించగా తోటి విద్యార్థులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. అతన్ని అత్యవసర చికిత్స కోసం కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

February 22, 2026 / 04:58 PM IST

జీవన జ్యోతిర్లింగ ధ్వజస్తంభం ప్రతిష్టాపన

SRD: జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని జీవన జ్యోతిర్లింగ శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు. ఆలయం ముందు ద్వాజస్తంభం ప్రతిష్ట కూడా శాస్త్రోక్తంగా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని దర్శించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు.

February 22, 2026 / 04:57 PM IST

‘శ్రీవారితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు’

AP: TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని వేంకటేశ్వర స్వామి వదిలిపెట్టబోరని శాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు. స్వామివారితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. స్వామివారిని అడ్డం పెట్టుకొని రూ.కోట్లు దండుకున్నారని ఆరోపించారు. చివరికి స్వామివారికి సమర్పించిన తలనీలాలను కూడా దోచేశారని దుయ్యబట్టారు.

February 22, 2026 / 04:57 PM IST

VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. ఇబ్రహీంపట్నం నుంచి కొండపల్లి వైపుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపుతప్పి బారికేడ్లను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారన్నారు. ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 04:54 PM IST

తిరుపతిలో ‘డయల్ యువర్ కమిషనర్’కు పిలుపు

తిరుపతి నగర ప్రజలు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను వినియోగించుకోవాలని కమిషనర్ ఎన్. మౌర్య సూచించారు. సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు కార్యక్రమం నిర్వహిస్తామని, 0877-2227208 నంబర్‌కు కాల్ చేసి సమస్యలు తెలియజేయాలని తెలిపారు.

February 22, 2026 / 04:51 PM IST

రేవంతుద్దీన్ పాలన నడుస్తోంది: అర్వింద్

TG: కామారెడ్డి జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. హౌస్ అరెస్టులతో బీజేపీ నేతలను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంతుద్దీన్ అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేపై దాడి జరిగి రెండ్రోజులు అవుతున్నా.. ఇప్పటివరకు స్పీకర్ ఆరా తీయకపోవడం దారుణమన్నారు. 

February 22, 2026 / 04:51 PM IST

గరుగు చింతలపల్లి చెరువును పరిశీలించిన మహేశ్వర్ రెడ్డి

ATP: గరుగు చింతలపల్లి చెరువుకు నీరు విడుదల చేయకపోవడంపై వైసీపీ మండల అధ్యక్షుడు పొన్నపాటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాకే శైలజానాథ్ నాయకత్వంలో అధికారులకు విన్నవించినా ఫలితం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండేళ్లుగా చెరువు ఎండిపోవడంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు.

February 22, 2026 / 04:50 PM IST

శిఖర్ ధావన్ రిసెప్షన్‌లో క్రికెటర్ల సందడి

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ వివాహ రిసెప్షన్ వేడుకకు స్టార్ క్రికెటర్లు హాజరయ్యారు. ఈ వేడుకకు రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దేతో కలిసి విచ్చేశారు. వీరితో పాటు యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా, సురేష్ రైనా తదితర ప్రముఖ క్రికెటర్లు హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం SMలో వైరల్ అవుతున్నాయి. కాగా ధావన్, సోఫీ షైన్‌ల వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

February 22, 2026 / 04:50 PM IST

రేపు యథావిధిగా మీకోసం కార్యక్రమం

ప్రకాశం: ఒంగోలులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ‘మీకోసం కార్యక్రమం’ (PGRS), రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజా బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల స్థాయిలలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే, నమోదైన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు

February 22, 2026 / 04:47 PM IST