మన దేశంలో ఆర్థిక అభివృద్ధి కంటే రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడతారని, అలాంటి పరిస్థితి మారాలని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడటం కాదని, ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలన్నారు. NHRD ఆధ్వర్యంలో నిర్వహించిన డీకోడ్ ది ఫ్యూచర్ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్‌లో చాలా తెలివైనవారు, ఎంతో గొప్పవారు నాయకులు ఉన్నారని, కానీ చాలామంది మెరుగైన ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్తు తరాలకు మంచి జీవితం అందించే అంశాలపై మాత్రం దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి సంవత్సరం ఎక్కడో ఓచోట ఎన్నికలు ఉంటాయని, కాబట్టి వాటిపైనే దృష్టి ఉందన్నారు. దేశం ముందు ప్రస్తుతం ఉన్న సమస్య… పార్టీలు, నాయకులు నిత్యం ఎన్నికలపై దృష్టి సారించడమే అన్నారు. చైనా, జపాన్ వంటి దేశాలు అభివృద్ధిలో దూసుకు వెళ్తుంటే, మనం ఎన్నికల కోసం పని చేస్తున్నామన్నారు.
మన దేశం నుండి ప్రపంచస్థాయిలో గుర్తింపు కలిగిన బ్రాండ్స్ ఎందుకు రావడం లేదో ఆలోచించాలన్నారు. ఆవిష్కరణలతో చిన్న చిన్న దేశాలు ముందుకు సాగుతుంటే, మన యువత మాత్రం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోందన్నారు. ఉద్యోగం సృష్టించేస్థాయికి ఎదగాలన్నారు. ఆ ఆలోచన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ కంటే చిన్నగా ఉండే సింగపూర్ ఆర్థికంగా చాలా ముందు ఉందన్నారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్రను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ మన వద్ద ఉందని గుర్తు చేశారు. గూగుల్, ఉబెర్ వంటి కంపెనీలు అమెరికా తర్వాత హైదరాబాద్‌లో రెండో పెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయన్నారు. మన ప్రభుత్వాలు ఎన్నికలపై కాకుండా… అమెరికా, జపాన్, చైనా, సింగపూర్ వలె ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారిస్తే ప్రపంచ నెంబర్ వన్‌గా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం