గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్‌కు నూతన ఛైర్మన్‌గా కుర్రా అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ యార్డ్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంతకం చేసి పదవిని చేపట్టారు. “చిల్లి సిటీ ఆఫ్ ఇండియా”గా గుర్తింపు పొందిన మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఈ సందర్భంగా అప్పారావు పేర్కొన్నారు.
ప్రకాశం: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను సమగ్రంగా పర్యవేక్షించాలని ఎంపీడీవో వీరభద్రాచారి సూచించారు. శుక్రవారం ఆయన కంభం పట్టణంలోని ఫ్యామిలీ సర్వేను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.పెండింగ్‌లో ఉన్న వివరాలను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
TG: HYDలోని ఎల్బీనగర్ చట్నీస్ హోటల్ భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దానికి వినియోగదారులు, చుట్టుపక్కల ప్రజలు పరుగులు తీశారు. చట్నీస్ హోటల్ లోని ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి హోటల్ లో ముగ్గురు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
HNK: పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలను ఎస్ఎఫ్ఐ నేతలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసర ప్రాంతాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఎఫ్ఐ నేతలు పాల్గొన్నారు.
KMR: రైతులు సంప్రదాయ పంటల నుంచి లాభసాటిగా ఉండే ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం పాల్వంచకు వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఆయిల్ ఫామ్ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
AP: ఇండియా AI ఇంపార్ట్ సమ్మిట్ – 2026లో CM చంద్రబాబు పాల్గొన్నారు. కృతిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అంశంపై సమావేశం నిర్వహించారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, WEF CEO బోర్గే బ్రెండే హాజరయ్యారు. సమీప భవిష్యత్‌లో అమరావతి క్వాంటం వ్యాలీపై ప్రపంచమంతా మాట్లాడే రోజు వస్తుందని చంద్రబాబు అన్నారు. గూగుల్ లాంటి సంస్థల రాకతో APలోని విశాఖ.. AI డేటా హబ్‌గా మారుతుందన్నారు.
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమిండియా తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోయిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. మన టాప్ ఆర్డర్ బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్నట్లు ఆయన తెలిపాడు. ఇక బౌలింగ్‌లో చక్రవర్తి మరోసారి తన స్పిన్ మ్యాజిక్‌తో ఆకట్టుకున్నాడని చెప్పాడు. టీ20ల్లో షాట్లు ఆడటమే కాదు, బంతిని టైమ్ చేస్తూ గ్యాప్స్‌లోకి ఆడటం కూడా ముఖ్యమన్నాడు.
SRCL: ఇల్లంతకుంటలో ఆరోగ్యలక్ష్మి పథకం అమలును బలోపేతం చేసేందుకు అంగన్వాడీ స్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. సమావేశానికి గ్రామ సర్పంచ్ ఎం.రాజు అధ్యక్షత వహించి తల్లి–బిడ్డల ఆరోగ్యమే గ్రామాభివృద్ధికి మూలమన్నారు. 12వ వార్డు సభ్యుడు కూనబోయిన రఘు చిన్నారులకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
TG: తాను BJPలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎంతో గౌరవించిందని కాంగ్రెస్ MLA రాజగోపాల్ రెడ్డి అన్నారు. BJPలో తనకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, స్టేట్‌లో స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ ఇచ్చారన్నారు. కానీ కాంగ్రెస్ కన్నతల్లిలాంటిదని తిరిగి వచ్చానన్నారు. మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి గెలిచి ఉంటే రాష్ట్ర రాజకీయం మరోలా ఉండేదని.. CPI నేత నెల్లికంటి సత్యం చెప్పిన మాటలను గుర్తుచేశారు.
NLG: చింతపల్లి మండలం మాల్ పట్టణంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతతో కలిసి ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆవిష్కరించి నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిదని ఎమ్మెల్యే తెలిపారు.
NZB: నగరపాలక సంస్థ మేయర్‌గా కూరగాయల ఉమారాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. నగరాభివృద్ధి ద్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
MNCL: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో బడిబయట పిల్లల గుర్తింపు సర్వే పూర్తి చేశామని DEO యాదయ్య శుక్రవారం ప్రకటనలో తెలిపారు. నివేదికలు రాష్ట్ర విద్యాశాఖకు అందించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి చదువులకు దూరంగా ఉన్నవారిని ఆయా పాఠశాలల్లో చేర్పించి చదువుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
SRPT: తిరుమలగిరి మండలం తాటిపాములలో ఇందిరమ్మ ఇళ్లకు శుక్రవారం ఎమ్మెల్యే సామేలు భూమి పూజ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయపల్లి కిషన్ పాల్గొన్నారు.
NRML: నూతనంగా ఎన్నికైన నిర్మల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ అప్పల కావ్య, వైస్ ఛైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తిలను ట్రస్మా జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యల పరిష్కారానికి సహకరిస్తే చాలా సమస్యలు దూరం అవుతాయని కోరారు.
ASF: తిర్యాణి జడ్పీ పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి, విద్యార్ధులతో మాట్లాడారు. హాజరు శాతం తక్కువగా ఉండటంపై ప్రధానోపాధ్యాయుడు అంజయ్యను వివరణ కోరారు. విద్యార్థులు క్రమం తప్పకుండా బడికి వచ్చేలా చూడాలన్నారు. అనంతరం టీచర్‌లా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు.