AP: మండలి ఛైర్మన్ ఛాంబర్ వద్ద మంత్రి లోకేష్ నేతృత్వంలో కూటమి పార్టీల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ తీరును జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జగన్ ఆదేశాలతోనే జరిగిందని స్పష్టంగా కనబుతోందని చెప్పారు. హిందువులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
VSP: బీజేపీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర కార్యాలయం(విశాఖ)లో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రజల వినతులు స్వీకరించారు. ఎస్‌వీఎస్ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి శుక్రవారం ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు.
TG: రాష్ట్రంలోని సాంఘీక సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు మెరుగైన పర్యవేక్షణ చేయాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడానికి నోడల్ అధికారులను నియమించాలని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
CTR: పలమనేరు విద్యుత్ సబ్ స్టేషన్‌లో శనివారం మరమ్మత్తులు నిర్వహిస్తున్నట్టు డీవైఈఈ జీవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో పలమనేరు రూరల్, గంగవరం, బైరెడ్డిపల్లి మండలాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గుర్తించి సహకరించాలని కోరారు.
BDK: చర్ల BRS పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కన్వీనర్ దొడ్డి తాతారావు అధ్యక్షతన ఇవాళ జరిగింది. భద్రాచలం నియోజకవర్గం సీనియర్ నాయకులు మానే రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రేపు రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
సత్యసాయి: జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్లు, బస్సులలో ప్రయాణికులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడే ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. రద్దీ సమయాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతూ అనుమానితులను మొబైల్ స్కానింగ్ పరికరాలతో తనిఖీ చేస్తున్నారు.
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంలో భాగంగా భద్రతా దళాల ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే వందలాది మంది నక్సల్స్ లొంగిపోగా.. చాలా మంది ఎదురుకాల్పుల్లో మరణించారు. మిగిలిన వారూ అడవులు వీడి జనజీవన స్రవంతిలోకి రావడం తప్ప మరో మార్గం లేదని మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. ఇటీవల మహారాష్ట్ర సీఎం ఎదుట మల్లోజుల లొంగిపోయిన విషయం తెలిసిందే.
ఢిల్లీ ముఖర్జీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన రెండేళ్ల అల్లుడిని వాకింగ్‌కు తీసుకెళ్లి గొంతు కోసి చంపింది. ఈ ఘాతుకానికి పాల్పడిన సదరు మహిళపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AP: అమరావతిలో నూతన హైకోర్టు ఐకానిక్ భవన నిర్మాణ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. అమరావతిలో 7 ఐకానిక్ భవనాలు నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. 2027 చివరి నాటికి హైకోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 21 లక్షల చదరపు అడుగులలో నిర్మాణం జరగనున్నట్లు చెప్పారు. B+G+7 అంతస్తుల్లో నూతన హైకోర్టు భవనం నిర్మాణం చేపట్టారు.
JN: బచ్చన్నపేట మండలం లింగంపల్లి చెందిన బొడ్డు ప్రవీణ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. జగన్ మరోసారి సీఎం కావాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా 100 దేవాలయాల్లో మోకాళ్లపై నడుస్తూ ప్రతి ఆలయంలో 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. శుక్రవారం కొడవటూరు సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు.
TG: భారత్ ఫ్యూచర్ సిటీ, AI సిటీ, AI యూనివర్సిటీ, ఏఐ ఆధారిత TG డిజిటల్ ఎక్స్ఛేంజ్, భూభారతి లాంటి విప్లవాత్మక సంస్కరణలు డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణ బ్రాండ్‍ను సుస్తిరం చేస్తాయని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతిక ఫలాలను కేవలం ఓ ప్రాంతానికో పరిమితం చేయకుండా అందరికీ చేరువ చేసేలా ‘ఏజెంటిక్ ఏఐ’ వినియోగంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు.
MNCL: మందమర్రి ఏరియాలో 90 మంది అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుల కేటాయింపు కోసం నిర్వహించిన టెండర్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని CPI పట్టణ కార్యదర్శి దుర్గరాజ్ శుక్రవారం ఆరోపించారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అర్హత లేని సంస్థలకు టెండర్లు కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ESI, PF బిల్లులు పరిశీలించాలన్నారు.
KMM: తెలంగాణ ఉద్యమకారుడు బత్తుల సోమయ్య గౌడ్-పంకజం దంపతులు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కూసుమంచి మండలం లోక్యాతండా వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు భవానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ స్పందించి శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి సోమయ్య-పంకజం దంపతులను పరామర్శించారు.
SRCL: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో దివ్యాంగుల సంక్షేమ పథకంలో భాగంగా ఉచిత ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటకు చెందిన ర్యాగటి శ్రీనివాస్, ర్యాగటి శ్రవణ్ వాహనాలు పొందారు. దివ్యాంగుల ఉపాధి, ప్రయాణ సౌకర్యానికి ఇవి ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.
PLD: వినుకొండ పట్టణంలో అర్బన్ పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ నాయకులు శుక్రవారం జిల్లా ఎస్పీ కృష్ణారావుకు వినతి పత్రం సమర్పించారు. సీఎం పర్యటన ఏర్పాట్ల సమీక్ష కోసం వినుకొండ వచ్చిన ఎస్పీని, సీపీఐ పట్టణ కార్యదర్శి రాము నేతృత్వంలోని బృందం మర్యాదపూర్వకంగా కలిసి ఈ విజ్ఞప్తిని చేశారు.