• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆయిల్ పామ్ లాభదాయకమైన పంట: తుమ్మల

TG: రైతులు కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, అధిక ఆదాయాన్ని ఇస్తూ లాభసాటిగా ఉండే ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు పాల్వంచలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సబ్సిడీలు, సాంకేతిక సహకారం అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.

February 20, 2026 / 03:16 PM IST

విక్రమ్ ‘మహాన్‌’కు సీక్వెల్ ప్లాన్!

తమిళ హీరో విక్రమ్, ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ కలిసి నటించిన మూవీ ‘మహాన్’. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా OTTలో రిలీజై మంచి హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌పై దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ.. ఈ సీక్వెల్ కోసం తన దగ్గర ఐడియా ఉందన్నాడు. కానీ స్క్రిప్ట్ ఇంకా ప్రారంభ దశలో ఉందని, 2027-28 నాటికి ఇది విడుదలయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు.

February 20, 2026 / 03:16 PM IST

యువత కోసం ‘హరీష్ అన్న’ ఉద్యోగ యాప్ లాంచ్

SDPT: సిద్దిపేట యువత కోసం ఎమ్మెల్యే హరీశ్ రావు సొంత ఖర్చుతో ‘హరీష్ అన్న ఉద్యోగ యాప్’ను ప్రారంభించారు. ఇందులో 57 రకాల పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్‌లైన్ క్లాసులు, 400 నమూనా ప్రశ్నాపత్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ యాప్ పోటీ పరీక్షార్థులకు, ఉద్యోగార్థులకు ఉపయోగపడుతుందని హరీశ్ రావు పేర్కొన్నారు.

February 20, 2026 / 03:15 PM IST

మల్లె బోయినపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

MBNR: జడ్చర్ల మండలం మల్లె బోయినపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత నివాసం కల్పించడానికి ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఐదు లక్షల రూపాయలు అందజేస్తుందని ఆయన చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

February 20, 2026 / 03:15 PM IST

ఓపెన్ స్కూల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

WNP: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైందని వనపర్తి డీఈవో అబ్దుల్ గని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 20వ తేదీ నుండి 27వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

February 20, 2026 / 03:15 PM IST

పేలిన గ్యాస్ సిలిండర్

MDK: తూప్రాన్ మండలం ఘనాపూర్ గ్రామంలో వంట చేస్తుండగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దొడ్ల సతీష్ ఇంట్లో శుక్రవారం వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇంట్లోని వస్తువులు, ఇంటి గోడలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో బాధితకుటుంబం తీవ్ర ఆందోళనలో మునిగి పోయింది.

February 20, 2026 / 03:15 PM IST

విశ్వానికి మొదటి గురువు తల్లి: ఎమ్మెల్యే

KMM: అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో సత్తుపల్లిలో ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి హాజరయ్యారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ మొదటి కార్యక్రమం 200 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందించారు. విశ్వానికి మొదటి గురువు తల్లి అని ఏమిలే వెల్లడించారు.

February 20, 2026 / 03:14 PM IST

‘రానున్న MPTC, ZPTC ఎన్నికలను బహిష్కరిస్తాం’

KRNL: ఆదోనిని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. శుక్రవారం ప్రత్యేక జిల్లా హోదా ప్రకటించే వరకు తమ ఓటు వేయబోమని పలువురు గ్రామస్తులు హెచ్చరించారు. రానున్న సర్పంచ్, MPTC, ZPTC ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించారు. ఆదోనికి జిల్లా హోదా కల్పించాలని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

February 20, 2026 / 03:12 PM IST

ఉద్యోగుల సమస్యలపై గ్రీవెన్స్

అనకాపల్లి కలెక్టరేట్‌లో శుక్రవారం ఉద్యోగుల సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ ఉద్యోగం నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల మూడవ శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిష్కారానికి అవకాశం గల ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

February 20, 2026 / 03:12 PM IST

విద్యార్థులను అభినందించిన కలెక్టర్

PDPL: ఈనెల 17న హైదరాబాద్ దోమలగూడలో విద్యాశాఖ ఆధ్వర్యంలో CBSN విద్యార్థులకు నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 మంది క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వారిని అభినందించారు. కార్యక్రమంలో DEO శారద, EI కోఆర్డినేటర్ కవిత పాల్గొన్నారు.

February 20, 2026 / 03:12 PM IST

మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా కుర్రా అప్పారావు

గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్‌కు నూతన ఛైర్మన్‌గా కుర్రా అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ యార్డ్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంతకం చేసి పదవిని చేపట్టారు. “చిల్లి సిటీ ఆఫ్ ఇండియా”గా గుర్తింపు పొందిన మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఈ సందర్భంగా అప్పారావు పేర్కొన్నారు.

February 20, 2026 / 03:11 PM IST

‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పూర్తి చేయాలి’

ప్రకాశం: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను సమగ్రంగా పర్యవేక్షించాలని ఎంపీడీవో వీరభద్రాచారి సూచించారు. శుక్రవారం ఆయన కంభం పట్టణంలోని ఫ్యామిలీ సర్వేను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.పెండింగ్‌లో ఉన్న వివరాలను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

February 20, 2026 / 03:10 PM IST

చట్నీస్ హోటల్‌లో పేలిన ఇడ్లీ స్టీమర్

TG: HYDలోని ఎల్బీనగర్ చట్నీస్ హోటల్ భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దానికి వినియోగదారులు, చుట్టుపక్కల ప్రజలు పరుగులు తీశారు. చట్నీస్ హోటల్ లోని ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి హోటల్ లో ముగ్గురు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

February 20, 2026 / 03:09 PM IST

‘విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి’

HNK: పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలను ఎస్ఎఫ్ఐ నేతలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసర ప్రాంతాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఎఫ్ఐ నేతలు పాల్గొన్నారు.

February 20, 2026 / 03:09 PM IST

రైతులు లాభసాటి పంటల వైపు మళ్లాలి: మంత్రి తుమ్మల

KMR: రైతులు సంప్రదాయ పంటల నుంచి లాభసాటిగా ఉండే ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం పాల్వంచకు వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఆయిల్ ఫామ్ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

February 20, 2026 / 03:09 PM IST