• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘చెత్త సేకరణ సమర్థవంతంగా నిర్వహించాలి’

SKLM: గ్రామాల్లో చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని పరిశుద్ధ కార్మికులకు ఎమ్మెల్యే గొoడు శంకర్ సూచించారు. గార మండలం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఆదివారం ట్రై సైకిల్స్, చెత్త డబ్బాలు ఆయన పంపిణీ చేశారు. అధికారులతో కలిసి గార జంక్షన్ వరకు అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దని కోరారు.

February 22, 2026 / 02:29 PM IST

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి: MLA

BHPL: మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ ఛైర్మన్‌గా అంబాల శ్రీనివాస్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై, మాట్లాడారు. మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. అనంతరం నూతన ఛైర్మన్ సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు.

February 22, 2026 / 02:29 PM IST

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: MLA

PLD: వినుకొండ TDP కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు ఆదివారం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారితో ఆయన ముఖాముఖి మాట్లాడి వినతులు స్వీకరించారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాల మంజూరులో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తన ప్రధాన ధ్యేయమన్నారు.

February 22, 2026 / 02:27 PM IST

‘ఈనెల 28లోగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి’

KNR: శంకరపట్నం మండలంలో 8402 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్ తెలిపారు. 4135 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోలేదని, రైతులు తమ వ్యవసాయ క్లస్టర్లలో ఏఈవోలతో ఈనెల 28లోగా చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు కేంద్ర ప్రభుత్వ పథకాల అర్హత కోల్పోతారని స్పష్టం చేశారు.

February 22, 2026 / 02:26 PM IST

ఆలయ ధర్మ గుండం పనుల పరిశీలన

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ధర్మగుండం పునర్నిర్మాణ పనులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ పరిశీలించారు. దాతల సహకారంతో జరుగుతున్న ఈ పనులను బ్రహ్మోత్సవాల (జాతర)లోపు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని ఆలయ కమిటీకి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

February 22, 2026 / 02:25 PM IST

జనగామ జిల్లాకు 2.73 కోట్లు మంజూరు

JN: జిల్లాలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2.73 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి SMAM పథకం కింద ఈ నిధులు మంజూరైనట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. రైతులకు కావలసిన యంత్ర పరికరాలు 50% రాయితో అందిస్తామని,రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని డీడీ రూపంలో సంబంధిత కంపెనీలకు చెల్లించాలని సూచించారు.

February 22, 2026 / 02:25 PM IST

చిట్యాల మున్సిపల్ పాలకవర్గం పదవి స్వీకారం

NLG: చిట్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా పందిరి గీత రమేష్, వైస్ ఛైర్ పర్సన్‌గా గుండెబోయిన శ్రీ లక్ష్మి సైదులు, కౌన్సిలర్లు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ దండు శ్రీనివాస్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే వేముల, రాష్ట్ర డైరీ ఛైర్మన్ గుత్తా అమిత్ నూతన పాలకవర్గాన్ని సన్మానించి, అభినందించారు.

February 22, 2026 / 02:25 PM IST

వరాహ నదిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏరివేత

AKP: ఎస్.రాయవరం మండలం వమ్మవరం వద్ద ఆదివారం సంత్ నిరంకారీ మిషన్ ఆధ్వర్యంలో వరాహ నదిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు నాచు తొలగించి శుభ్రం చేశారు. మిషన్ కసింకోట సెక్టార్‌కు చెందిన సంయోజకులు కె చిదంబరావు, నాగరాజు, ప్రచారకులు సత్యవతి, వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వ్యర్ధాలు వల్ల నది జలాలు కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

February 22, 2026 / 02:25 PM IST

మొనకూరులో ‘కార్డన్ అండ్ సెర్చ్’

TPT: మొనకూరు పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో రూరల్ సర్కిల్ సీఐ, ఎస్సైలు సిబ్బందితో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పలు ఇళ్లలో సోదాలు నిర్వహించి, రికార్డులు లేని 15 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం సేవనం, గంజాయి వినియోగం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు. మహిళలు, పిల్లల పట్ల గౌరవప్రదమైన ప్రవర్తనతో కొనసాగాలని సూచించారు.

February 22, 2026 / 02:25 PM IST

నూతన బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: కొవ్వూరు RTC బస్‌స్టాండ్ వద్ద కొవ్వూరు నుంచి తాళ్లపూడి, పోలవరం వెళ్ళే నూతన బస్ సర్వీస్‌ను కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఇవాళ ప్రారంభించారు. ఈ బస్సు సర్వీస్ కొవ్వూరు డిపో నుంచి సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రారంభమవుతుందని తెలిపారు. కావున ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 02:25 PM IST

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డికి ఘన నివాళి

చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి 179వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చిత్తూరు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

February 22, 2026 / 02:25 PM IST

బాపట్లలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

బాపట్లలో ఆదివారం టీడీపీ పార్లమెంట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి, ఎంపీ కృష్ణప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్టీ బలోపేతం, అభివృద్ధి పనుల వేగవంతం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలన్నారు.

February 22, 2026 / 02:25 PM IST

మద్యం దుకాణాలను పరిశీలించిన ఎక్సైజ్ సీఐ

VZM: చీపురుపల్లిలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాలను ఎక్సైజ్ సీఐ చక్రవర్తి పరిశీలించారు. షాపుల వద్ద రద్దీ చేపట్టకూడదని షాపుల యాజమాన్యాలకి సూచించారు. పండుగ పురస్కరించుకొని అధిక ధరల అమ్మినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ వినియోగించాలని సూచన చేశారు.

February 22, 2026 / 02:24 PM IST

బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

NDL: నందికొట్కూరు(M) కొనేటమ్మ పల్లెలో సర్పంచ్ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.1.90 కోట్లతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణానికి MLA జయసూర్య, తదితరులు ఆదివారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. రహదారులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించి CM బీటీ రోడ్లు వేస్తున్నారని తెలిపారు.

February 22, 2026 / 02:23 PM IST

‘మొద‌టి ఆప్ష‌న్ థియేటర్ ఎక్స్‌పీరియెన్సే: దర్శకుడు

మూవీ థియేటర్ల భవిష్యత్తుపై దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘OTTల సబ్‌స్క్రిప్షన్ మోడల్ వల్ల మూవీలు నేరుగా స్ట్రీమింగ్‌కే పరిమితమై, థియేట్రికల్ బిజినెస్ దెబ్బతినే ప్రమాదం ఉంది. వార్నర్ బ్రదర్స్ వంటి పెద్ద స్టూడియోలు ఇదే బాట పడితే భారీ బడ్జెట్ మూవీల నిర్మాణం తగ్గిపోవచ్చు. అయితే నా మొదటి ప్రాధాన్యత మాత్రం థియేటర్ ఎక్స్‌పీరియెన్సే’ అని తెలిపారు.

February 22, 2026 / 02:23 PM IST