• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాచూరులో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

సత్యసాయి: రొద్దం మండలం రాచూరు గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. రొద్దం మండల టీడీపీ కన్వీనర్ నరహరి మాట్లాడుతూ.. మంత్రి సవిత ఆదేశాల మేరకు రాచూరు బస్టాండ్ నుంచి జక్కలచెరువు గ్రామం వరకు రూ.1 కోటి నిధులతో బీటీ రోడ్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రహదారి నిర్మాణంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు.

February 22, 2026 / 03:30 PM IST

దాడిని ఖండించిన బీసీ సంఘాలు

MBNR: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో చాకలి కులస్తులపై రెడ్డీ కులస్తులు చేసిన దాడిని ఖండిస్తూ రజక సంఘంతో పాటు వివిధ ప్రజా కుల సంఘాలు కలిసి మహబూబ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన చేశారు. ఈ మేరకు రజక సంఘం జాతీయ నేత నడి మింటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ అమానుష సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

February 22, 2026 / 03:30 PM IST

DCC అధ్యక్షుల శిక్షణా శిబిరంలో పాల్గొన్న రామకృష్ణ

NZB: తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల 10 రోజుల శిక్షణ శిబిరంలో నిజామాబాద్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నగరంలో పార్టీ బలోపేతానికి చేపట్టిన చర్యలను వివరించారు. నిజామాబాద్ కార్పొరేషన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకునేలా రూపొందించిన వ్యూహాలను, భవిష్యత్తు కార్యచరణను వివరించారు. పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

February 22, 2026 / 03:30 PM IST

‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగం యువతకు స్ఫూర్తి’

KDP: స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారని, ఆయన యువతకు స్ఫూర్తి అని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా రేనాటి సూర్యచంద్రుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రొద్దుటూరులోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

February 22, 2026 / 03:27 PM IST

టీమిండియా తుది జట్టు ఇదే..!

సౌతాఫ్రికాతో జరగబోయే మ్యాచ్‌ కోసం టీమిండియా తుది జట్టులో పెద్దగా మార్పులు చేయకూడదని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని భిప్రాయపడ్డాడు. ఈ మేరకు పఠాన్ అంచనా వేసిన టీమిండియా తుది జట్టు ఇలా ఉంది: ఇషాన్, అభిషేక్, తిలక్, సూర్య, పాండ్యా, దూబే, రింకూ, అక్షర్, అర్ష్‌దీప్, చక్రవర్తి, బుమ్రా.

February 22, 2026 / 03:27 PM IST

కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

RR: శంషాబాద్‌లో ముదిరాజ్ కమ్యూనిటీ నూతన భవనాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ భవనం కమ్యూనిటీ అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డా. బండ ప్రకాష్, ఎమ్మెల్యే టీ. ప్రకాశ్ గౌడ్ పాల్గొన్నారు.

February 22, 2026 / 03:26 PM IST

మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన అర్బన్ ఎమ్మెల్యే

NZB: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదివారం BJP జిల్లా కార్యాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. మన్ కీ బాత్” అంటే దేశ ప్రజలతో ప్రధాన మంత్రి ప్రత్యక్ష సంభాషణ వేదిక అని అన్నారు.

February 22, 2026 / 03:25 PM IST

‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్

తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’లో సమంత నటిస్తోన్న మూవీ ‘మా ఇంటి బంగారం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. 2026 మే 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక నందిని రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

February 22, 2026 / 03:24 PM IST

పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే

పెద్దపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులో కమాన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. దశలవారీగా పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పు స్వరూప, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 03:21 PM IST

అబ్బుర పరుస్తున్న బుడ్డోడి ప్రతిభ

W.G: పాలకొల్లు శంభునిపేటలో ప్రాతః కాలంలో కొన్ని క్షణాలపాటు దృగ్విషంగా కనువిందు చేసిన ‘ఎర్రని సూరీడ్ని’ ఒకటో తరగతి చదువుతున్న వడ్డి గౌరీ శంకర్ అనే బుడతడు సెల్ ఫోన్లో బందించాడు. ఆదివారం తల్లి శైలజతో కలిసి వాకింగ్ చేస్తుండగా తల్లి చేతిలోని సెల్ఫోన్ తీసుకుని క్లిక్ మనిపించాడు. ఈ ఫోటోని వీక్షించిన వారందరూ గౌరీ శంకర్ ఫోటోగ్రఫీ ప్రతిభను ఔరా అంటూ మెచుకుంటున్నారు.

February 22, 2026 / 03:21 PM IST

పిట్లం లయన్స్ క్లబ్‌కు 11 అవార్డులు

KMR: లయన్స్ క్లబ్ ఇంటర్‌‌నేషనల్ (2024-25) అవార్డుల వేడుకలో పిట్లం లయన్స్ క్లబ్ విశేష ప్రతిభ కనబరిచి ఉత్తమ క్లబ్ పురస్కారాన్ని దక్కించుకుంది. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు వ్యక్తిగత అవార్డులను కూడా అందుకున్నారు. ఉత్తమ అధ్యక్షుడిగా కాశిరెడ్డి, ఉత్తమ మండలాధ్యక్షుడిగా కిషన్ ఎంపికయ్యారు. వీరితో పాటు సంజీవరెడ్డి, వేణుగోపాల్ తమసేవా కార్యక్రమాలకు అవార్డులు అందుకున్నారు.

February 22, 2026 / 03:20 PM IST

ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం

ATP: గుంతకల్‌లోని రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాణత్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, రెడ్డి సోదరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 03:20 PM IST

ఆలయాల నిర్మాణానికి శంకుస్థాపన

NLG: ఉరుమడ్లలో ముత్యాలమ్మ, మారమ్మ దేవాలయాల నూతన నిర్మాణ పనులకు తెలంగాణ డెయిరీ కార్పోరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భానుశ్రీ, నాయకులు దేవేందర్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్న అమిత్ రెడ్డిని గ్రామ ప్రజలు అభినందించారు.

February 22, 2026 / 03:20 PM IST

పేదలపై సర్కార్ కక్ష సాధిస్తోంది: వెల్లంపల్లి

AP: పేదలపై కూటమి సర్కార్ కక్ష సాధిస్తోందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. జగన్ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే  చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారని  తెలిపారు. అమరావతిలో పేదలు నివసించకూడదా? అని నిలదీశారు.

February 22, 2026 / 03:20 PM IST

శ్రీ పోలేరమ్మ తల్లి సన్నిధిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

NLR: అల్లూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ పోలేరమ్మ తల్లిని ఆదివారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతుల కోసం అమ్మవారిని ప్రార్థించారు. గ్రామదేవతల ఆశీస్సులతో సమాజం సుభిక్షంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

February 22, 2026 / 03:20 PM IST