• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కిడ్నాప్ కేసు.. BRS మాజీ MLAకు నోటీసులు

TG: ఇబ్రహీంపట్నం మాజీ MLA మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డికి ఇవాళ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్ ఎపిసోడ్ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. కిడ్నాప్ కేసులో విచారణకు హాజరై తమ వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 22, 2026 / 02:36 PM IST

నాని, సుజీత్ మూవీలో ఇద్దరు భామలు!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు బాలీవుడ్ భామలు భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో త్రిప్తి డిమ్రి కథానాయికగా నటించనుండగా.. మరో కీలక పాత్రలో సీనియర్ నటి మాధురి దీక్షిత్ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 జూన్ నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

February 22, 2026 / 02:36 PM IST

అంబా భవానీ ఆలయంలో 25వ వార్షికోత్సవం

NRPT: దామరగిద్ద మండలంలోని అంబా భవానీ ఆలయంలో భవానీ మాత విగ్రహ 25వ వార్షికోత్సవ వేడుక ఘనంగా నిర్వహించబడింది. అమ్మవారికి మంగళహారతులు, బండారు, చందనం, అభిషేక పూజలు చేశారు. ప్రభురాజ్, రఘునాథ్ రావు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం అందజేశారు. ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 02:34 PM IST

అన్నమయ్య: BED విద్యార్థిని ఆత్మహత్య

అన్నమయ్య: రైల్వే కోడూరులోని రంగనాయకుల పేటలో ఇవాళ B.Ed చదువుతున్న ఆమంచి భార్గవి (24) ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI లక్ష్మీ ప్రసాల్ రెడ్డి తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 02:33 PM IST

మంథనిలో రాత్రివేళ బస్సులు ఆపాలని వినతి

PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్, కూచిరాజుపల్లి, గంగాపురి స్టేజీల వద్ద రాత్రి సమయంలో ఎక్స్‌ప్రెస్ బస్సులు నిలిపివేయాలని డిపో మేనేజర్ శ్రావణ్‌కుమార్‌కు బీజేపీ నాయకుడు బోయిని నారాయణ వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లి తిరిగివచ్చే ప్రయాణికులు బస్సులు ఆగక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

February 22, 2026 / 02:33 PM IST

మేయర్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్‌ను కాంగ్రెస్ పార్టీ లక్షేట్టిపేట మండల నాయకులు కలిశారు. మంచిర్యాల మేయర్‌గా ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా లక్షెట్టిపేట మండల, పట్టణ నాయకులు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 02:32 PM IST

రేపే ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..!

WG: ఆచంట ఎంవీఆర్ జూనియర్ కళాశాల కేంద్రంలో సోమవారం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 270 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా, ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలవుతుందని ప్రిన్సిపల్ ఎన్. శ్రీదేవి తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరుగుతాయని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

February 22, 2026 / 02:31 PM IST

రూ.42 లక్షల విలువ గల చెక్కులు పంపిణీ

ATP: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు 29 మంది బాధితులకు రూ.42 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లలో నిరుపేదలకు ఇటువంటి సాయం అందలేదని, ఇప్పుడు పారదర్శకంగా లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు.

February 22, 2026 / 02:30 PM IST

‘రూ. 203 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి’

GNTR: రాష్ట్రంలోని 16 సంఘాల ఆధ్వర్యంలో మంగళగిరిలో ‘చేనేత గర్జన’ నిర్వహించారు. ఎన్నికల్లో ఇస్తానన్న రూ. 25 వేల సాయం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలు అమలు చేయలేదని కార్మికులు మండిపడ్డారు. రూ. 203 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు ఇచ్చామని మంత్రి సవిత అబద్ధాలు చెప్తున్నారని, కేంద్రం జీఎస్టీ భారం తగ్గించాలని కోరారు.

February 22, 2026 / 02:29 PM IST

బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో ట్విస్ట్!

TG: ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అతడిది సాధారణ మరణం కాదని, పక్కాగా ప్లాన్ చేసిన సుపారీ హత్య అని ఖమ్మం పోలీసులు నిర్ధారించారు. నిందితులు శ్రీనివాస్‌ను హతమార్చి.. ఈ మొత్తం తతంగాన్ని కారు ప్రమాదంగా చిత్రీకరించారని దర్యాప్తులో తేలింది. ఇక శ్రీనివాస్ గతంలో పవన్ కళ్యాణ్‌‌పై ఒక పుస్తకాన్ని రచించిన విషయం తెలిసిందే.

February 22, 2026 / 02:29 PM IST

ఆలయాల ట్రస్ట్ బోర్డు సభ్యులతో గోవా గవర్నర్ భేటీ

AP: నాలుగు ఆలయాల ట్రస్ట్ బోర్డు సభ్యులతో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు భేటీ అయ్యారు. విజయనగరం కోటలోని మాన్సాస్ కార్యాలయంలో ట్రస్ట్ బోర్డు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. పైడితల్లి, మందపల్లి మందేశ్వరస్వామి, సంతపేట జగన్నాథస్వామి, శ్రీకూర్మనాథస్వామి ఆలయాల ట్రస్ట్ బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఆలయాల అభివృద్ధి పనులపై ఈవోలు, పాలకమండలి సభ్యులతో చర్చించారు. 

February 22, 2026 / 02:29 PM IST

‘చెత్త సేకరణ సమర్థవంతంగా నిర్వహించాలి’

SKLM: గ్రామాల్లో చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని పరిశుద్ధ కార్మికులకు ఎమ్మెల్యే గొoడు శంకర్ సూచించారు. గార మండలం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఆదివారం ట్రై సైకిల్స్, చెత్త డబ్బాలు ఆయన పంపిణీ చేశారు. అధికారులతో కలిసి గార జంక్షన్ వరకు అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దని కోరారు.

February 22, 2026 / 02:29 PM IST

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి: MLA

BHPL: మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ ఛైర్మన్‌గా అంబాల శ్రీనివాస్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై, మాట్లాడారు. మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. అనంతరం నూతన ఛైర్మన్ సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు.

February 22, 2026 / 02:29 PM IST

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: MLA

PLD: వినుకొండ TDP కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు ఆదివారం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారితో ఆయన ముఖాముఖి మాట్లాడి వినతులు స్వీకరించారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాల మంజూరులో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తన ప్రధాన ధ్యేయమన్నారు.

February 22, 2026 / 02:27 PM IST

‘ఈనెల 28లోగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి’

KNR: శంకరపట్నం మండలంలో 8402 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్ తెలిపారు. 4135 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోలేదని, రైతులు తమ వ్యవసాయ క్లస్టర్లలో ఏఈవోలతో ఈనెల 28లోగా చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు కేంద్ర ప్రభుత్వ పథకాల అర్హత కోల్పోతారని స్పష్టం చేశారు.

February 22, 2026 / 02:26 PM IST