MBNR: కౌకుంట్ల మండలం పేరూరు గ్రామ రైల్వే స్టేషన్ సమీపంలో చిరుత పులి సంచారిస్తుందని స్థానికులు నేడు ఓ ప్రకటనలో వెల్లడించారు. పులి సంచారిస్తుందని తెలిసిన గ్రామస్తులు ఆందోళనకు లోనయ్యారు. తమ పంట పొలాలకు వెళ్లాలంటే భయందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసులోవాలని స్థానికులు కోరారు.
GNTR: తెనాలి ఓవర్ బ్రిడ్జి వద్ద నిబంధనలకు విరుద్ధంగా రాంగ్ రూట్లో వాహనాలు నడుపుతుండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. మంగళవారం చెంచుపేట వైపు నుంచి మార్కెట్ వైపు వస్తున్న ఓ కారు రాంగ్ రూట్లో రావడంతో, వంతెనపై దాదాపు 30 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి రాంగ్ రూట్ రాకపోకలను అరికట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
బాపట్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, అక్రమ రవాణా అరికట్టేందుకు మంగళవారం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా వాహనాల తనిఖీలు, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. వాహనదారులకు హెల్మెట్ వాడకం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రజల భద్రతే తమ లక్ష్యమని అన్నారు.
KRNL: హొళగుంద మండల కేంద్రంలో రేపు వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు SR ఫంక్షన్ హాల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొనాలని కన్వీనర్ షఫీ ఉల్లా కోరారు.
ప్రకాశం: సీఎం చంద్రబాబు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబందించిన పర్యటన షెడ్యూల్‌ను CMO అధికారులు విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం 12:50కి దోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను పరిశీలించి, మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 2:30కి మార్కాపురంలో బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.
అనకాపల్లి: ఈనెల 23న తగలపువలసలో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ సెలెక్షన్స్ ట్రయల్స్‌లో మాకవరపాలెం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. తైక్వాండో విభాగంలో దువ్వు అనురాధ, పోలవరపు దేవి, యడ్ల హాసిని, కరాటే విభాగంలో కెఎన్.లోకనాథ్ తమ తమ విభాగాల్లో మొదటి స్థానాలు సాధించి అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికయ్యారు. వీరిని యూనివర్సిటీ సిబ్బంది అభినందించారు.
AP: రాజమండ్రిలో పాల కల్తీకి అధికారులు కారణాలు గుర్తించారు. కూలెంట్ లీకేజ్ వల్లే కల్తీ జరిగిందని భావిస్తున్నారు. కూలింగ్ ఛాంబర్‌లో వినియోగించే ఇథలిన్ గ్లెకాల్ విషపదార్థం పాలలో కలిసిందన్నారు. ఇథలిన్ గ్లెకాల్ కలిసిన పాలు తాగి బాధితులు అనారోగ్యానికి గురయ్యారు. ఈనెల 15న గ్రామస్తులు పాలు చేదుగా ఉన్నాయని పాల వ్యాపారి గణేష్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్, కనుపర్తిపాడు లో 22.50 లక్షల రూపాయల వ్యయంతో 2.60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎస్.టి. కాలనీ శ్మశాన వాటికలో పనులు జరుగుతున్నాయి. మంగళవారం ప్రహరీ గోడ నిర్మాణ పనులను కూటమి నాయకులతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.
W.G: విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఎస్‌టీయూ శంఖారావం కార్యక్రమం చేపట్టినట్టు ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షడు, కార్యదర్శులు కెవి.రామచంద్రరావు, పిఆర్ఆర్‌విఎస్.సాయి వర్మ తెలిపారు. సమర శంఖారావంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు సమస్యల పరిష్కారం కోసం దశల పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
JGL: జగిత్యాల మండలం ధరూర్ ఎస్సారెస్పీ కెనాల్లో దూకి నూకపల్లి అర్బన్ కాలనీకి చెందిన అనూష మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అనూష కుటుంబం గత కొన్నేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నారు. ఉదయం విజయవాడ నుంచి వచ్చిన కొందరితో డబ్బుల విషయంలో ఘర్షణ జరగడంతో, అవమాన భారంతో అనూష ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.
KKD: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ కౌంటర్ ఇచ్చారు. ముద్రగడ అంబటి రాంబాబును పరామర్శించిన నేపథ్యంలో ఎంపీ ఒక ప్రకటన విడుదల చేశారు. పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న పద్మనాభం కాపుల గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని ఎద్దేవా చేశారు. రాజకీయ స్వార్థం కోసం కాపుల ఆత్మ గౌరవాన్ని వినియోగించుకోవద్దన్నారు.
SKL: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జె.కె.సీ, B.B.Q Nation ఆధ్వర్యంలో నేడు ట్రైనింగ్ కమ్–జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ టి. గోవిందమ్మ తెలిపారు. ఎస్.ఎస్.సీ ఉత్తీర్ణులై 18 నుంచి 28 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు కోఆర్డినేటర్ వి.ల్యూక్ పాల్‌ను సంప్రదించాలన్నారు.
TG: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులాలు మతాలు ప్రస్తావన లేకుండా పైశాచిక సంఘటన ఏదైనా ఖండించాల్సిందేనన్నారు. ఈ దాడిలో చిన్నపాప మృతి బాధాకరమన్నారు. పాప మృతికి కారణమైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.
KRNL: జిల్లా అభివృద్ధిపై మంత్రులు రామానాయుడు, TG భరత్ సమక్షంలో కీలక సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రాలయం TDP ఇంఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి నియోజకవర్గ పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల అవసరాలపై నివేదిక సమర్పించారు. ఈ నెల 26న CM చంద్రబాబుతో జరిగే సమావేశానికి పూర్తి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.
నెల్లూరు కార్పొరేషన్ ఇంఛార్జ్ మేయర్‌గా గడిచిన 70 రోజుల్లో తాను ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టానని రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తన కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. నిరంతరం కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేశానన్నారు. సహకరించిన అన్ని విభాగాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.