• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రజా సమస్యలు పరిష్కారమే ప్రభుత్వం లక్ష్యం

SKLM: ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం టీడీపీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి పలు సమస్యల పై దరఖాస్తు రూపంలో వినతులు స్వీకరించారు. వినతులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

February 20, 2026 / 12:12 PM IST

నగరంలో పార్కింగ్ ‘పరేషాన్’.. సామాన్యుడి జేబుకు చిల్లు!

HYD: గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న HYDలో ‘పార్కింగ్’ సమస్య ఇప్పుడు సగటు జీవికి శాపంగా మారింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన వసతులు లేవు. ఉన్నచోట అక్రమ వసూళ్లు దడ పుట్టిస్తున్నాయి. అటు అధికారులు, ఇటు ప్రైవేట్ యాజమాన్యాల మధ్య సమన్వయ లోపం సామాన్యుడికి శాపంగా మారుతోంది. ఈ అక్రమాలను అరికట్టేందుకు GHMC స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

February 20, 2026 / 12:10 PM IST

ప్రేమపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రబృందంతో ముచ్చటించిన ప్రభాస్ ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా నటి మానస వారణాసి ‘ప్రేమపై మీ అభిప్రాయం ఏంటి?’ అని అడగ్గా.. ప్రభాస్ సిగ్గుపడుతూ సమాధానమిచ్చాడు. ‘నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది. ఆ అద్భుతమైన ఫీలింగ్‌ను అనుభవించాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అని మనసులో మాట బయటపెట్టాడు. ప్రభాస్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరలవు...

February 20, 2026 / 12:09 PM IST

కలెక్టర్ కార్యాలయం వద్ద వాటర్ సప్లై వ్యాన్‌కు ప్రమాదం

VSP: కలెక్టర్ ఆఫీస్ సమీపంలో స్పీడ్ బ్రేకర్ దాటుతుండగా శ్రీ వెంకటేశ్వర వాటర్ సప్లైకి చెందిన వాహనం ముందుభాగం తీవ్రంగా దెబ్బతిన్న ఘటన ఆందోళన కలిగించింది. స్పీడ్ బ్రేకర్ వద్దే వాహనం నుజ్జునుజ్జు కావడం చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు సక్రమంగా ఉన్నాయా? తగిన తనిఖీలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

February 20, 2026 / 12:08 PM IST

విద్యార్థుల ప్రగతికి నాంది కావాలి: ఎంఈవో

SRD: కాంప్లెక్స్ సమావేశాలు విద్యార్థుల ప్రగతికి నాంది కావాలని కొండాపూర్ ఎంఈవో దశరథ్ అన్నారు. శుక్రవారం మండలంలోని తొగర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిరి పాఠ్యాంశాలను అవగాహన చేసుకుని తరగతి గదుల్లో విద్యార్థులకు సులభమైన రీతిలో బోధించాలని సూచించారు. గుణాత్మక విద్యను అందించాలన్నారు.

February 20, 2026 / 12:07 PM IST

YS జగన్‌ను కలిసిన బ్రహ్మానందం

AP: YCP అధినేత జగన్‌ను ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కలిశారు. తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లేందుకు జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బ్రహ్మానందం.. జగన్‌ని చూసి పలకరించారు. ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఇందుకు సంబంధించని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

February 20, 2026 / 12:06 PM IST

కోడుమూరు రాజవర్ధన్ రెడ్డి కుటుంబానికి భారీ పరిహారం

KRNL: మాజీ MPP రాజవర్ధన్‌రెడ్డి రోడ్డు ప్రమాద మృతి కేసులో ఆయన కుటుంబానికి రూ. 2.25 కోట్లు నష్టపరిహారం 7.5% వడ్డీతో చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. 2022 ఏప్రిల్ 20న జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు. పిటిషన్‌పై విచారణ అనంతరం లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.

February 20, 2026 / 12:04 PM IST

మానత్వం చాటుకున్న ఎస్ఐ నరేష్

వనపర్తి జిల్లా నర్సింగయ్య పల్లి డిగ్రీ కాలేజ్ వద్ద శుక్రవారం ఉదయం రెండు బైకులు ఢీ కొని ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని సరైన సమయంలో అంబులెన్స్ అందుబాటు లేకపోవడంతో గతంలో గోపాల్పేట ఎస్సైగా విధులు నిర్వహించిన నరేష్ తన బైక్‌పై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలు శభాష్ పోలీస్ అని కొనియాడారు.

February 20, 2026 / 12:03 PM IST

టమాటా కేజీ ధర రూ.5 మాత్రమే..!

AKP: నర్సీపట్నం కాయగూరలు మార్కెట్లో కేజీ టమాటా ధర దారుణంగా పడిపోయింది. కేజీ కేవలం రూ.5 మాత్రమే ఉండడంతో దారుణంగా నష్టపోతున్నామని పలువురు రైతులు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని పేర్కొన్నారు. రైతు బజార్లో కనీసం కేజీ రూ.10లకు అమ్ముకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

February 20, 2026 / 12:01 PM IST

మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దిరెడ్డి

CTR: పులిచెర్ల మండలం మంగళంపేటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి మహా సంప్రోక్షణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణలత, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. వారు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

February 20, 2026 / 12:01 PM IST

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ELR: బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ మనేంద్ర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వ్యర్ధాల నిర్వహణ క్రమ పద్ధతిలో చేయాలని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను బాధ్యతారహితంగా పడేయకూడదని వాటి వాడకం తగ్గించాలని సూచించారు.

February 20, 2026 / 12:00 PM IST

అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న MLA

ASF: పెంచికల్ పేట్ మండలం బొంబాయి గూడ గ్రామంలో నూతనంగా నిర్మితమైన అభయాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి MLA హరీష్ బాబు శుక్రవారం హాజరయ్యారు. వేద పండితులు బాచంపల్లి కమలాకర్ శర్మ ఆధ్వర్యంలోప్రతిష్టాపన జరిగింది. యాగశాలను సందర్శించిన MLAకు వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు.

February 20, 2026 / 12:00 PM IST

చింతలపూడిలో విద్యార్థులకు అవగాహన సదస్సు

ELR: చింతలపూడిలోని PMSHRI ZP హైస్కూల్లో శుక్రవారం పోలీసులు విద్యార్థినీ, విద్యార్థులకు, మత్తు పదార్థాల నివారణ కొరకు, సైబర్ క్రైమ్, పోక్సో యాక్ట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, డయల్ 112 లేదా స్థానిక పోలీస్ అధికారులను నేరుగా, ధైర్యంగా సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్సై సతీష్ కుమార్ పాల్గొన్నారు.

February 20, 2026 / 11:59 AM IST

హుస్నాబాద్‌లో ప్రార్థన మందిరం కూల్చివేత

SDPT: హుస్నాబాద్‌లో ఓ క్రైస్తవ ప్రార్థన మందిరాన్ని అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నిర్వాహకుల ప్రకారం దాదాపు 200 మంది సభ్యులు ఇక్కడ ఆరాధనలు నిర్వహిస్తున్నారు. స్థల వివాదంపై గతంలో కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందన్నారు. ఇప్పటికే పలుమార్లు ధ్వంసం చేసిన మందిరాన్ని మళ్లీ కూల్చివేశారని వాపోయి, బాధ్యులను శిక్షించాలన్నారు.

February 20, 2026 / 11:56 AM IST

ప్రభాస్‌తో సంతోష్ శోభన్ స్పెషల్ మూమెంట్..!

సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన రెబెల్ స్టార్ ప్రభాస్, చిత్ర బృందాన్ని కలిసి ప్రత్యేకంగా అభినందించాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను కలిసిన సంతోష్ శోభన్ ఆ ఫొటోను SMలో షేర్ చేస్తూ.. మొదటి నుంచి తనకు అండగా నిలుస్తున్నందుకు డార్లింగ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.

February 20, 2026 / 11:56 AM IST