HNK: గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజలు సహకరించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ తరాలపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయ పునర్ నిర్మాణం, ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి నేడు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. తరాలపల్లి అభివృద్ధికి సహకరిస్తానని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు.
CTR: పుంగనూరు పట్టణంలోని చంద్రకాంత్ వీధిలో యూరియా కోసం ఎండను సైతం లెక్కచేయకుండా క్యూలైన్‌లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఒక్క రైతుకు ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు. అధికారులు సకాలంలో రైతులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
KNR: జమ్మికుంట మార్కెట్‌కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని, తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందని ఉన్నత శ్రేణి కార్య దర్శి రాజా తెలిపారు. శుక్రవారం మార్కెట్‌కు రైతులు 44 వాహనాల్లో 368 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,500, కనిష్ఠంగా రూ. 6,300ల ధర పలికింది. పత్తి ధర నిన్నటి కంటే రూ. 50 తగ్గింది.
విజయనగరానికి చెందిన తెలికిచెర్ల శ్రీతోద్భవ్ షిల్లాంగ్లో ఈ నెల 23 నుండి 27 వరకు జరిగే ఇస్రో NSSS 2026 అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనున్నారు. తాను రాసిన పరిశోధనాత్మక వ్యాసం ” సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ త్రూ కాస్మిక్ లైఫ్ విసబిలిటీ మెట్రిక్” అనే అంశంపై ఇస్రో, పలువురు అంతర్జాతీయ, అంతరిక్ష పరిశోధకులకు వివరించబోతున్నారు.
సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డులో BRS పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకిచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్‌నైనా వాస్తవాల ఆధారంగా రూపొందించి హామీలన్నీ నెరవేర్చాలని చెప్పుకొచ్చారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మున్సిపల్ నూతన ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్‌ను మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ వెంకట్రాంరెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని ప్రవీణ్ కుమార్ తెలిపారు.
WGL: నెక్కొండ (M) కేంద్రంలోని పత్తిపాక తండాకు చెందిన బి రజిత–లక్ష్మణ్ దంపతులు నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని MLA దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఆయన, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత 10 సం,రాలు అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం ఇళ్లు ఇవ్వలేదని అన్నారు.
NZB: రాజంపేటలో 157వ బూత్ బీజేపీ అధ్యక్షుడు జూకంటి రాజిరెడ్డి తండ్రి, సోదరుడు ఇటీవల అకాల మరణం చెందడంతో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అకాల మరణం చెందడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, వారి కుటుంబానికి అండగా ఉంటామని, ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఆయనతో బాటు మున్సిపల్ కౌన్సిలర్లు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
VZM: జిల్లా పంచాయతీ అధికారి డి. వి.మల్లిఖార్జున శుక్రవారం కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. స్వర్ణ పంచాయతీ ఇంటి పన్నుల బకాయిలు 2025, 26 వరకు సంబంధించి రూ 1.48 లక్షలు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ 65 లక్షలు వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. పంచాయతీ షాపుల అద్దెలు బకాయిలు ఉన్నాయని, త్వరలో వసూలుకు చర్యలు చేపడతామన్నారు. ఈఓపీఆర్డీ ఉన్నారు.
VZM: మెరకముడిదాం మండలంలోని స్దానిక గర్భం AP మోడల్ స్కూల్లో 2026- 27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ అరుణకుమారి శుక్రవారం. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 24 నుంచి వచ్చే నెల 31లోపు www.apms.apcfss.in వైబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 12 తేదిన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
TG: గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి తీపి కబురు చెప్పింది. తాజాగా 15వ ఆర్థిక సంఘం కింద మూడవ విడతలో భాగంగా 387.53 కోట్లు విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే రూ. 259.36 కోట్లు విడుదల కాగా రెండో విడత కింద రూ. 387 కోట్లు విడుదల చేసింది. తాజాగా మూడో విడత నిధులు రిలీజ్ చేయడంతో దీంతో ఇప్పటివరకు 1034.42 కోట్లు విడుదలయ్యాయి.
GDWL: మున్సిపల్ నూతన చైర్‌పర్సన్‌గా తుమ్మల జయలక్ష్మి శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆమెను అభినందించారు. అందరి సహకారంతో గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.
AKP: అచ్యుతాపురం మండలంలోని పూడిమడక జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం ఎస్సై సుధాకర్ విద్యార్థులకు డ్రగ్స్, మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పించారు. గంజాయి వంటి నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాలని, కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. అనుమానాస్పద సమాచారం పోలీసులకు తెలియజేయాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండి, మోసాలకు గురికావద్దని హెచ్చరించారు.
CTR: యాదమరి సమీపంలో బావిలో పడి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ పోలీసు సిబ్బంది దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
MNCL: రెవిన్యూ శాఖలో ఎంతో కాలంగా పనిచేస్తున్న టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లను కొనసాగించాలని అధ్యక్షుడు వెంకటేష్ కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు టీఎన్జీవోస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పథకాల అమలు , ఎన్నికల నిర్వహణలో కృషి చేసిన కంప్యూటర్ ఆపరేటర్లను ఇతర ఉద్యోగాలకు వెళ్లాలనడం కష్టంగా ఉందని తెలిపారు.