BDK: ఇల్లందు మండలం మాణిక్యరం గ్రామంలో శుక్రవారం సీతారామచంద్ర స్వామి వారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మనసారా కోరుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
KRNL: పేదల సమస్యల పరిష్కారంలో మంత్రి టీజీ భరత్ మరోసారి చొరవ చూపారు. కర్నూలు కొత్తపేటకు చెందిన నరసింహ–శ్వేత దంపతుల కుమారుడు కార్తికేయ (9) పుట్టుకతో దివ్యాంగుడు. శస్త్రచికిత్సకు రూ.8.20 లక్షలు అవసరమని వైద్యులు తెలపడంతో వారు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. విషయం మంత్రి దృష్టికి వెళ్లడంతో నిధులు మంజూరై, నంద్యాలలో శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది.
VZM: దేశ సంపదలో సామాజిక న్యాయం జరగాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న డిమాండ్ చేశారు. అంతర్జాతీయ సామజిక న్యాయం దినోత్సవం సందర్భంగా శుక్రవారం బొబ్బిలిలో దేశ సంపదలో సామాజిక న్యాయం జరగాలని కోరుతూ నిరసన తెలిపారు. మధ్య తరగతి ఉద్యోగులు, ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు కొంతమంది చేతుల్లోకి వెళ్తుందని విమర్శించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఈ నెల 21న పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఆదేశించారు. నేపథ్యంలో పిల్లలకు ఇంటి వద్ద సహాయం ఎలా అందించాలన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా 10వ తరగతి, అలాగే 2వ, 3వ తరగతి ఎఫ్ఎల్ఎన్/ ఎఫ్ఎల్ఎస్ పరీక్షల డీఈవో సూచించారు.
SS: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురంలో జరిగిన నూతన గృహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో దంపతులు ఇరువురు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. తమ నియోజకవర్గ ప్రజల శుభకార్యాల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా బాలకృష్ణ పేర్కొన్నారు.
RR: తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, మహేశ్వరం నియోజకవర్గం నాగారం గ్రామానికి చెందిన సిరిపురం యాదయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.
అన్నమయ్య: రాయచోటిలో జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లాకు విచ్చేసిన హైదరాబాద్ సీపీసజ్జన్నార్‌ను అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్థానిక గెస్ట్ హౌస్‌లో జరిగిన భేటీలో సీపీకి మొక్కను అందజేసి స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై కాసేపు చర్చించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున గౌరవపూర్వక అభినందనలు తెలిపారు.
KNR: గంగాధర మండలంలోని బురుగుపల్లి గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దులం కళ్యాణ్ ఆధ్వర్యంలో కిరాణా, చికెన్, మటన్ షాప్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి, ప్లాస్టిక్ కవర్లకు బదులుగా బయోడీగ్రేడబుల్ కవర్లు వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా MPDO ప్లాస్టిక్ వల్ల పర్యావరణం నష్టాలను వివరించారు.
SKLM: ధర్మవరం మండలం వెంకటాపురం గ్రామంలో జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి ప్రసాద్ రావు పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆహారం అందుతుందా లేదా అనే విషయంపై విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చిన తెలియజేయాలని కోరారు.
HYD: నగరంలోని సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్‌తో కలిసి కోర్టు ప్రాంగణాన్ని పరిశీలిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఇలాంటి బెదిరింపు మెయిల్ వచ్చిన నేపథ్యంలో మళ్లీ అదే తరహా సందేశం రావడం ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
SRPT: తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జునకు వినతి పత్రం అందజేశారు. ఫణిగిరి రామస్వామి గట్టు వద్ద నిర్మించిన సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లను, అర్హులైన ప్రైవేట్ ఉపాధ్యాయులకు కేటాయించాలని రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు మున్సిపల్ వైస్ చైర్మన్‌ను కోరారు. అనంతరం ఆయనను ప్రైవేట్ ఉపాధ్యాయులు సన్మానించారు.
HYD: జీవో నం. 15 ప్రకారం మాల్స్ లేదా మల్టీప్లెక్స్‌లో మొదటి 30 నిమిషాలు పార్కింగ్ పూర్తిగా ఉచితం. ఒకవేళ అక్కడ షాపింగ్ చేస్తే గంట వరకు ఉచితంగా ఉండాలి. కానీ, మాదాపూర్, గచ్చిబౌలి పరిధిలోని కొన్ని ప్రధాన మాల్స్ ‘డిజిటల్ ఎంట్రీ’ పేరుతో వాహనం లోపలికి వెళ్లకముందే సమయాన్ని లెక్కిస్తున్నాయి. లోపల సమయం వృథా అయ్యేలా చేసి రూ. 50 నుంచి రూ. 100 వసూలు చేయడం గమనార్హం.
GDWL: నడిగడ్డ భక్తుల ఆరాధ్యదైవం, జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయాన్ని గద్వాల నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు శుక్రవారం సందర్శించారు. ఆలయ ఈవో పురందర కుమార్, అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు వారికి శ్వేత వస్త్రాలు సమర్పించారు.
ASR: పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కొయ్యూరు మండలం యూ.చీడిపాలెం పీహెచ్‌సీ డాక్టర్ హేమంత్ చౌదరి సిబ్బందికి సూచించారు. శుక్రవారం పలకజీడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. 64మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స అందించామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ఈవో గంగరాజు, ఎల్టీ ఆనంద్ పాల్గొన్నారు.
GNTR: పెదపరిమిలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని శుక్రవారం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన దాతలను అభినందించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడం సంతోషకరమని పేర్కొన్నారు.