ఓ విభిన్నమైన మిస్టిక్ థ్రిల్లర్ కథతో నందమూరి కళ్యాణ్ రామ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రచయిత శ్రీకాంత్ విస్సా ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడట. ఇప్పటికే కథా చర్చలు పూర్తి కాగా.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు టాక్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీని త్వరలోనే పట్టాలెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
KDP: ఖాజీపేట(M) ముత్తలూరుపాడు, మూలవారిపల్లె గ్రామాల్లో దాదాపు రూ. 20 లక్షలతో నూతనంగా సిమెంటు రోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ పనులను గ్రామ సర్పంచ్ కొంగని వెంకటసుబ్బయ్య ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ..గ్రామంలో ప్రతి వీధికి సిమెంటు రోడ్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామయ్య వార్డు మెంబర్ సునీత పాల్గొన్నారు.
కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిను ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఆత్మీయంగా పలకరించారు. శుక్రవారం విమానాశ్రయానికి వచ్చిన సందర్భంగా ఇద్దరూ కాసేపు స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. ఈ అనూహ్య భేటీ అక్కడున్న ప్రయాణికులు, అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది.
HYD: నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. దిల్‌సుఖ్ నగర్‌లోని హైదరాబాద్-2 డిపో నుంచి రాకపోకలు సాగించే బస్సులకు సంబంధించి ప్రయాణికుల నుంచి సలహాలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు నేడు సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు 9959226249 నంబర్‌కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మాటలు నమ్మడం వల్లే T20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగిందని BCB జనరల్ సెక్రటరీ సయ్యద్ అష్రాఫుల్ హక్ సంచలన ఆరోపణలు చేశారు. తమ బోర్డ్ చీఫ్ అమీనుల్ ఇస్లామ్‌ను నఖ్వీ రెచ్చగొట్టారని.. ఆయన మాటలు విని ఎవరు మాత్రం గెలిచారని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా భారత్ తమ ప్లేయర్లకు సేఫ్ కాదంటూ బంగ్లా టోర్నీ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.
E.G: కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామానికి చెందిన మహమ్మద్ జరీనాకు రూ. 1,55,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కును రాజానగరం నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ బత్తుల, వెంకటలక్ష్మి శుక్రవారం అందజేశారు. ఎమ్మెల్యే బత్తులు బలరామకృష్ణ సిఫార్సు మేరకు ఈ చెక్కు అందించడం జరిగింది అన్నారు.
ప్రకాశం: ఆర్టీసీ గ్యారేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనిగిరి ఆర్టీసీ డిపో గ్యారేజ్ వద్ద ఆర్టీసీ కార్మికులు ఎస్డబ్ల్యుఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సమస్త కేటాయించాలని, గ్యారేజీలను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేశారు.
W.G: ఆకివీడులోని విద్యార్థులు అసెంబ్లీ సందర్శించేందుకు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. స్థానిక జడ్పీ హైస్కూల్‌కు, సరోజినీ నాయుడు బాలిక ఉన్నత పాఠశాలకు చెందిన 43 మంది విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. స్థానిక హై స్కూల్ వద్ద బస్సులో విద్యార్థులు ఎక్కించి కూటమి నాయకులు జండా ఊపి ప్రారంభించారు.
BHPL: కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఛైర్మన్ పరిశీలించారు. అనంతరం కాసేపు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో ఛైర్మన్ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ELR: ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని బడేటి చంటి శుక్రవారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి ప్రాధాన్యత నిస్తూ కృషి చేస్తున్నామన్నారు. క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వచ్చిన ప్రజలు నిరాశతో వెళ్లకూడదనే ఉద్దేశంతోనే అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ ఉదయాన్నే వినతులు స్వీకరించామన్నారు.
BDK: జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో పశు వైద్యశాల శిథిలావస్థకు చేరింది. దీంతో పశు వైద్య సిబ్బంది పశువులను తీసుకొచ్చిన రైతులు లోపలికి వెళ్లాలంటే భయపడుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న పశు వైద్యశాలను తొలగించి నూతన పశువైద్యశాలను నిర్మించాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ ఇవాళ ప్రభుత్వాన్ని కోరారు.
SKLM: పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలోని నిర్మించిన నూతన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం ఈ కార్యక్రమానికి పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, నిత్యపూజల కోసం రూ. 2.లక్షల విరాళం అందజేశారు.
MNCL: గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులు భాగస్వాములు కావాలని జన్నారం మండలం ఎంపీవో జలంధర్ సూచించారు. జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు పోన్కల్ రైతు వేదికలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగింది. పలు విషయాలను వార్డు సభ్యులకు ఎంపీవో వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామని TDP నాయకులు గిరిధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరు రూరల్ MLA కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
గుంటూరు రైల్వే స్టేషన్‌లోని 1వ నంబర్ ప్లాట్‌ఫారమ్ ట్రాక్‌పై శుక్రవారం ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని రైల్వే పోలీసులు కనుగొన్నారు. రైలు ఢీకొనడం వల్లే సుమారు 35 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు మెరూన్, తెల్ల రంగు బొమ్మలున్న చొక్కా ధరించి ఉన్నదని ఆచూకీ తెలిసినవారు రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.