సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, మెగా అభిమానుల మధ్య ఓ కొత్త వివాదం తలెత్తింది. ఈ వివాదం, ఇటీవల విడుదలైన “దేవర” ట్రైలర్‌పై నడుస్తోంది. మెగా అభిమానులు ఈ ట్రైలర్ వ్యూస్ సంఖ్యను, చిరంజీవి నటించిన “ఆచార్య” ట్రైలర్‌తో పోలుస్తూ, “దేవర” ట్రైలర్‌కు కనీసం ఆసక్తి లేకపోయిందని, ఈ ట్రైలర్ ఆచార్య చిత్రాన్ని ను పోలి ఉందని వ్యాఖ్యలు చేశారు.
ఇక, ఎన్టీఆర్ అభిమానులు ఈ ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ, “దేవర” చిత్రం నూన్ షో కలెక్షన్స్ తోనే ఆచార్య లైఫ్ టైం కలెక్షన్స్ ను కొడుతుందని అన్నారు.. దేవర విడుదల దగ్గరపడుతున్న కొద్దీ ఇలాంటి వివాదాలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
“దేవర” సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలకానుంది. ఈ చిత్రం, ఎన్టీఆర్ గత చిత్రాలతో పోలిస్తే, బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్‌ను అందుకునే అవకాశముందని అంచనా. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో వీరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం, సినిమా విడుదల తరువాత ఎలా ఉంటుందో చూడాలి. ఓవర్సీస్ లో కూడా దేవర సత్తా చాటుతుంది, అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా వున్నాయి. ప్రీమియర్స్ 3 మిలియన్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వారాగాలు అంటున్నాయి