గత కొన్ని నెలల నుంచి నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ మధ్య విభేదాలు నెలకొన్నాయని, వీరిద్దరూ విడిగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇటు మెగా కుటుంబం గానీ అటు చైతన్య కుటుంబం గానీ స్పందించలేదు. కానీ ఇటీవల విడాకులు తీసుకున్న తర్వాత తొలి పోస్ట్ చేసింది నిహారిక.
Niharika Divorce: మెగా డాటర్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ విడాకుల వార్తలు ఎట్టకేలకు నిజం అయ్యాయి. మంగళవారం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు వారిద్దరికీ విడాకులు మంజూరు చేసినట్లు వార్తలు వచ్చాయి. మూడేళ్ల క్రితం చైతన్యతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గత కొన్ని నెలల నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయని, వీరిద్దరూ విడిగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇటు మెగా కుటుంబం గానీ అటు చైతన్య కుటుంబం గానీ స్పందించలేదు. ఈ ఏడాది నిహారిక చైతన్య తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో వీరు విడాకులు తీసుకుంటున్నట్లు కన్ఫర్మ్ అయింది. కానీ ఇప్పటివరకు అది అధికారికంగా కన్ఫామ్ కాకపోవడంతో విభేదాలు మాత్రమే వచ్చాయని అందరూ భావించారు.
తాజాగా వీరిద్దరూ విడాకులు కోర్టు మంజూరు చేసిందని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ఈ విడాకులపై నిహారిక స్పందించింది. తాను చైతన్య మ్యూచువల్ గా విడిపోతున్నామని తెలిపింది. “చైతన్య నేను మ్యూచువల్ గా విడిపోదామని నిర్ణయించుకున్నాం.. దయచేసి ఇలాంటి సున్నితమైన సమయంలో మమ్మల్ని ఒంటరిగా వదిలేయాలని కోరుకుంటున్నాం. మేమిద్దరం ఇకపై కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. దయచేసి మా ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరుకుంటున్నాం. ఇంతవరకు మాకు తోడుగా ఉన్న కుటుంబానికి సన్నిహితులకు అభిమానులకు నా కృతజ్ఞతలు” అని ఇన్ స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది.