ఐఐటీ మద్రాస్ నుంచి ఇంజినీరింగ్ డ్రాప్ అవుట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, యూట్యూబర్, మీమర్ నవీన్(poolachokka naveen) నాయక్ తో హీట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ. అసలు చదువు మధ్యలో ఎందుకు ఆపేశాడు. తన గతం ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
మీకు పూలచొక్కా నవీన్ నాయక్(poolachokka naveen) గురించి తెలుసా? యూట్యూబ్, ఇన్ స్టాగ్రాం ద్వారా అనేక రకాల మీమ్స్ చేసి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అంతేకాదు పూలచొక్కా యూట్యూబ్ ద్వారా 30 కోట్లకుపైగా వ్యూస్ దక్కించుకున్నాడు. దీంతోపాటు ఐదు మీమ్స్ పేజీలను మెయింటెన్ చేస్తూ ప్రస్తుతం ఫుల్ బిజీగా మారాడు. అయితే ఇతను ఐఐటీ మద్రాస్ లో ఇంజినీరింగ్లో జాయిన్ అయ్యి మధ్యలోనే డ్రాప్ అయ్యాడు. ఆ తర్వాత ఉయ్యాలా జంపాలా చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా కూడా పని చేశాడు. 2018లోనే మీమ్స్ పేజీ ప్రారంభించి ఇప్పటికే 30 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ సాధించాడు.
అయితే నవీన్ నాయక్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి ముందు ఏం చేశాడు. అసలు సినిమా రంగంలో పలు విభాగాల్లో పనిచేసి మళ్లీ ఎందుకు బయటకు వచ్చాడు. పల్లి బఠాని, గోలీ సోడా, బందర్ లడ్డు అనే యూట్యూబ్ ఛానెల్ పేర్లను ఎందుకు అనుకున్నాడు. తన ప్రయత్నానికి వారి తల్లిదండ్రులు ఒప్పుకున్నారా లేదా? ఏ జూడ్, బీకేపీ హోమ్స్, హర్ష సాయి, బ్యాంకాక్ పిల్లా స్పూఫ్ లను ఎందుకు చేశాడనే విషయాలు తెలియాలంటే మాత్రం ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే.