ప్రధాని మోడీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. నల్లచట్టాలు తెచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీసింది మోడీ కాదా అన్నారు. తమ నినాదం రైతు రాజ్యం అని.. వారిది మాత్రం కార్పొరేట్ రాజ్యం అని మండిపడ్డారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ నినాదించారని తెలిపారు. ఇంత దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలో ఎక్కడా లేరన్నారు. దేశ ప్రజల చూపు కేసీఆర్ వైపు ఉందన్నారు.
రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం కాదని మోడీకి సెటైర్లు వేశారు. విజన్ ప్రకారం నాయకులు పని చేయాలని సూచించారు. యూఎన్వో కూడా రైతుబంధును ప్రశంసించిందని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్‌వన్‌గా ఉన్నామని తెలిపారు. కేసీఆర్ అంటే మెచ్చని నేత లేరు, ఆర్థికవేత్త లేరన్నారు.
తెలంగాణ పల్లెలు ప్రగతిపథంలో నడుస్తున్నాయని చెప్పారు. దేశం కడుపునింపే స్థాయికి తెలంగాణ చేరుకుందన్నారు. రైతుబంధు, రైతు బీమా దేశంలో ఎక్కడ లేవన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలా మారిందని కేటీఆర్ అన్నారు. నాబార్డు, ఎఫ్‌సీఐ నివేదికలను కూడా విశ్వసించరా అని అడిగారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాతో పోటీపడుతున్నాం అని తెలిపారు. గుజరాత్లో మాత్రం పవర్ హాలీడేలు ప్రకటించారని గుర్తుచేశారు. పనిలో పనిగా ఈటల రాజేందర్‌ను కూడా విమర్శించారు. ఇటువైపు ఉన్నప్పుడు బాగున్న ఈటల, అటువెళ్లాక పూర్తిగా మారిపోయాడని మండిపడ్డారు.