అద్భుతమైన సినిమాలతో కుర్రకారుతో పాటు ఇంటిల్లిపాదిని కట్టి పడేసే సినిమాలు తీసిన దర్శకుడు తేజ.. సుదీర్ఘ విరామం తర్వాత ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేశ్ బాబు (D Suresh Babu) చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్ (Daggubati AbhiRam)ను హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’ (Ahimsa Movie) అని సినిమా తెరకెక్కించారు. జూన్ 2వ తేదీన ఈ సినిమా విడుదల అవుతుండడంతో వరుసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమా కన్నా తన వ్యక్తిగత అంశాలతో పాటు మిగతా విషయాలపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తన కుమారుడు, కుమార్తె విషయంతోపాటు దివంగత ఉదయ్ కిరణ్ (Uday Kiran) విషయమై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాటి విషయంలో తేజ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో (Interview) దర్శకుడు తేజ తన దర్శకత్వ జీవితంతోపాటు వ్యక్తిగత విషయాలు (Personal) పంచుకున్నారు. తన కుమార్తె, కుమారుడి జీవితాలపై ఆసక్తికర అంశాలు తెలిపారు. ‘మా అమ్మాయి విదేశాల్లో (Foreign) విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చింది. ఆమెకు నేను పెళ్లి (Marriage) చేయను. నచ్చిన వాడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పా. ఆ తర్వాత అందరికీ భోజనాలు పెడదామని ఆమెతో చెప్పా. పెళ్లి తర్వాత ఒకవేళ నచ్చకపోతే విడాకులు (Divorce) ఇచ్చేయని తెలిపారు. ఎందుకంటే మనం సంతోషంగా ఉండడమే ముఖ్యం. ప్రజలు ఏం అనుకుంటారనేది మనకు అనవసరం. నా ఇద్దరు పిల్లలకు ఇదే చెబుతా’ అని తేజ చెప్పారు.
ఇక కుమారుడు భవిష్యత్ విషయమై మాట్లాడుతూ.. ‘మా అబ్బాయి దర్శకత్వంపై కోర్సు పూర్తి చేశాడు. త్వరలోనే హీరోగా (Hero) పరిచయం చేస్తాను’ అని స్పష్టం చేశారు. ఇక ఉదయ్ కిరణ్ మరణంపై స్పందిస్తూ.. ‘చాలా మందికి ఉదయ్ కిరణ్ మృతి (Death) వెనుక కారణం తెలుసు. కావాలని నాతోనే చెప్పించాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావడం లేదు’ అని తేజ పంచుకున్నారు.
అభిరామ్, గీతికా తివారి (Geethika Tiwary) హీరోహీరోయిన్లు ‘అహింస’ సినిమాతో వెండితెరకు పరిచయమవుతున్నారు. సీనియర్ దర్శకుడు తేజ చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టారు. మరి అప్పటి తేజలో ఇంకా దర్శకుడు ఉన్నాడో లేదో వేచి చూడాలి. ఈ సినిమా ట్రైలర్ (Trailer) ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా కొంత జయం మాదిరి ఉన్నట్టు ట్రైలర్ ను బట్టి చూస్తే తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో.. దర్శకుడిగా తేజ సక్సెస్ అయ్యాడో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.