తెలంగాణ ముఖ్యమంత్రి ప్రస్తుతం జాతీయ పార్టీపై ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో కొంతకాలంగా ఆయన దేశ రాజధాని ఢిల్లీలోనే ఉంటూ వస్తున్నారు. కాగా… తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్ననే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయల్దేరిన కేసీఆర్ ప్రగతి భవన్ కి రాగానే అందుబాటులో ఉన్న అధికారులతో మంత్రులతో సమావేశమయ్యారు.
కాగా… ప్రస్తుతం ఆయన వచ్చే నెలలో జరగనున్న మునుగోడు ఎన్నికలపై కేసీఆర్ దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పటికే… ఈ ఉపఎన్నికల్లో ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని గడపగడపకు ప్రచారం చేస్తున్నారు. మునుగోడులో ఎన్నికల(munugode bypoll) ప్రచారంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.
ఈ నెల 28,29,30న మునుగోడులో బస్సు యాత్ర, రోడ్ షో లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు మునుగోడులో బస్సు యాత్రకు ఏర్పాట్లు చేయాలని నేతలను కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 30న చండూరులో భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి వరుసగా మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నెల 25 నుంచి టీఆర్ఎస్ కీలక నేతలు మునుగోడులోనే మకాం వేయనున్నారు.