PM Narendra Modi election campaign for two days in AP.. What are the dates?
AP Elections: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావిడీ కొనసాగుతుంది. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు అయిపోయాయి. మే 7 న మూడవ దశ ఎన్నికలు నిర్వహించనున్నాయి. ఈ మేరుకు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మే 13న నాలుగవ దశఎన్నికల్లో భాగంగా లోక్ సభ, శాసన సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనిలో భాగంగా ఈ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఏపీలో పర్యటించనున్నారు. మొత్తం రెండు రోజుల పాటు మోడీ ప్రచారంలో పాల్గొంటారు. అందులో భాగంగా రోడ్ షో ( Road Shows)లు, పలు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
చదవండి:2 Thousand Crores: అనంతపూర్ నుంచి హైదరాబాద్‌కు.. 4 కంటైనర్లలో 2 వేల కోట్లు
ఈ మేరకు ఆయన పర్యటించనున్న తేదీలు ప్రకటించారు. మే 7,8 వ తేదీల్లో ఏపీలో ప్రధాని పర్యటించనున్నారు. ఆయన షెడ్యూల్ ప్రకారం 7వ తేదీన వేమగిరిలో రాజమహేంద్రవరం కూటమి అభ్యర్థి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. రోడ్డు షో, బహిరంగ సభలో పాల్గొని, సాయంత్రం అనకాపల్లిలోని రాజుపాలెం సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. మే 8న పీలేరు సభలో, సాయంత్రం విజయవాడ చేరుకోనున్నారు. అక్కడ ఇందిరా స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్‌షోలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని ఏపీ శ్రేణీలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
చదవండి:Allu Arjun: అల్లు అర్జున్ ‘జనసేన’ ప్రచారం.. పవన్ ఫ్యాన్స్ హ్యాపీనా?

