»Jandhan Account Update Jan Dhan Account Holders Are Getting Rs 10000 Apply Like This
JanDhan Account:జన్ ధన్ ఖాతాదారులకు శుభవార్త.. మీ అకౌంట్లో రూ.10వేలు
జన్ ధన్ ఖాతా ఉన్నవారికి ఇప్పుడు కేంద్రం గొప్ప వార్త తెలిపింది. జన్ ధన్ ఖాతాదారులకు (ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన) కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రూ.10,000 అందజేస్తోంది. దీంతో పాటు ఈ ఖాతాపై బీమా సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించింది.
JanDhan Account:కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇందులో పేదలకు ఆర్థిక సహాయం నుండి ఉచిత రేషన్(Free Ration) వరకు సౌకర్యాలు అందించబడుతున్నాయి. జన్ ధన్ ఖాతా ఉన్నవారికి ఇప్పుడు కేంద్రం గొప్ప వార్త తెలిపింది. జన్ ధన్ ఖాతాదారులకు (ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన) కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రూ.10,000 అందజేస్తోంది. దీంతో పాటు ఈ ఖాతాపై బీమా సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించింది. దేశంలోని 47 కోట్ల మందికి పైగా ఖాతాదారులు దీని ప్రయోజనాన్ని పొందుతారు. అయితే, ఈ డబ్బు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం ఎవరికి రూ.10 వేలు బహుమతి ఇస్తుందో తెలుసుకుందాం.
రూ.10,000 పొందడం ఎలా?
జన్ ధన్ ఖాతా దారులందరికీ ప్రభుత్వం నుంచి ఓవర్డ్రాఫ్ట్(Over Draft) సౌకర్యం కల్పించబడుతుంది. ఈ సదుపాయం కింద ఖాతాలో ఒక్క రూపాయి లేకపోయినా రూ. 10,000 విత్డ్రా చేసుకోవచ్చు. ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యంపై ఇంతకుముందు రూ.5000లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, అయితే ప్రభుత్వం ఈ పరిమితిని 10,000కి పెంచింది.
పథకం ప్రత్యేకతలు
– 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల వారు ఖాతా తెరవవచ్చు.
– ఈ పథకం యొక్క డబ్బు 60ఏళ్ల వయస్సు వరకు అందుబాటులో ఉంటుంది.
– ఇందులో ఏడాదికి 36000 రూపాయలు బదిలీ చేయబడతాయి.
– అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు.
– మీ నెలవారీ ఆదాయం 15000 రూపాయల కంటే తక్కువ ఉంటే మీరు మాత్రమే దాని ప్రయోజనాన్ని పొందవచ్చు.
ఖాతాను ఎక్కడ తెరవాలి ?
ఈ ప్రభుత్వ ఖాతాను ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలోని ఏ బ్యాంకు(Bank)లోనైనా తెరవచ్చు. మీకు ఇప్పటికే సేవింగ్స్ ఖాతా(Savings Account) ఉంటే.. దానిని మీరు జన్ ధన్ ఖాతాగా మార్చుకోవచ్చు. ఈ ఖాతాను తెరవడానికి కనీస వయసు 10 సంవత్సరాలు.