»Indias 1st Depression Surgery In Mumbai Post Mental Health Act 2017
Depression Surgery: ఇండియాలో మొదటి సైకియాట్రిక్ ఆపరేషన్ సక్సెస్
2017లో కొత్త మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్ ఆమోదించబడిన తర్వాత భారతదేశంలో జరిగిన మొదటి సర్జరీ ఇది. కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం.. రోగి సమ్మతి తెలిపినా.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మానసిక ఆరోగ్య బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే సైకో సర్జరీని నిర్వహించవచ్చు.
Depression Surgery: గత 26 సంవత్సరాలుగా డిప్రెషన్‌తో పోరాడుతున్న 38 ఏళ్ల ఆస్ట్రేలియన్ మహిళ ముంబైలో సైకియాట్రిక్ ఆపరేషన్ చేయించుకున్న మొదటి వ్యక్తిగా నిలిచింది. 2017లో కొత్త మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్ ఆమోదించబడిన తర్వాత భారతదేశంలో జరిగిన మొదటి సర్జరీ ఇది. కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం.. రోగి సమ్మతి తెలిపినా.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మానసిక ఆరోగ్య బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే సైకో సర్జరీని నిర్వహించవచ్చు. గతంలో ఇలాంటి దరఖాస్తులను ఆస్పత్రి బోర్డు పరిశీలనలో ఉంచేది.
ఆస్ట్రేలియన్ మహిళ ఆపరేషన్ చేయడానికి రాష్ట్రం నుండి అనుమతులు పొందడానికి దరఖాస్తు చేసుకుంది. న్యూరో సర్జన్ పరేష్ దోషిని సంప్రదించడంతో ప్రారంభమైన ప్రక్రియ 10 నెలలు పట్టింది. “మానసిక ఆరోగ్య బోర్డును ఏర్పాటు చేయడంలో మహారాష్ట్ర అనేక ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది, ఇప్పుడు శస్త్రచికిత్సకు అనుమతి ఇవ్వడంలో ఇది మొదటిది” అని పెద్దర్ రోడ్‌లోని జస్లోక్ ఆసుపత్రిలో రోగికి ఆపరేషన్ చేసిన డాక్టర్ దోషి అన్నారు. డిప్రెషన్ అనేది అత్యంత సాధారణమైన మానసిక ఆరోగ్య సమస్య, కొన్ని అధ్యయనాలు జనాభాలో 15శాతం మందిలో సంభవించే అవకాశం ఉంది. ఈ రోగులలో దాదాపు మూడింట ఒకవంతు మంది డిప్రెషన్‌ను కలిగి ఉంటారు. చాలామందికి మాత్రలు వివిధ థెరపీల ద్వారా నయం అవుతుంది. కొంత మందికి నయం కాదు. అలాంటి వారికి చివరి ప్రయత్నంగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (DBS) సర్జరీని అందిస్తారు. దీనిలో న్యూరో పాత్‌వేలను మార్చడానికి మెదడులో ఎలక్ట్రోడ్లు ఉంచుతారు. పార్కిన్సన్స్ నుండి అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్, డిప్రెషన్ వరకు అనేక నాడీ సంబంధిత పరిస్థితులకు DBS ఉపయోగించబడుతుంది. గతంలో డిప్రెషన్‌తో బాధపడుతున్న ముగ్గురు రోగులకు ఆపరేషన్ చేశామని, వారు బాగానే ఉన్నారని డాక్టర్ దోషి తెలిపారు.
ఆస్ట్రేలియన్ మహిళ 26 సంవత్సరాలుగా డిప్రెషన్‌తో పోరాడుతున్నారు. వివిధ రకాల యాంటిడిప్రెసెంట్స్, థెరపీలను ప్రయత్నించారు. ఆమె శిక్షణ పొందిన ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అయినప్పటికీ, ఆరోగ్యం బాగోలేక ఆమె ఏడేళ్ల క్రితం మానేసింది. ఆమె 20 వేర్వేరు యాంటిడిప్రెసెంట్లను ప్రయత్నించింది. ఆమె ECT (ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీలు), కాగ్నిటివ్, బిహేవియరల్ థెరపీకి కూడా ఎక్కువ ప్రయోజనం లేకుండా పోయింది. కొన్నేళ్ల క్రితం జస్లోక్ హాస్పిటల్లో డిప్రెషన్‌తో బాధపడుతున్న ఇద్దరు ఆస్ట్రేలియన్ రోగుల నుండి ఆమె కుటుంబానికి డాక్టర్ దోషి గురించి తెలిసింది. ఆయను సంప్రదించి ఆపరేషన్ చేయించుకుంది. శస్త్రచికిత్స సమయంలో రోగి మానసిక స్థితి కొద్దిగా మెరుగుపడిందని ఆమె సోదరుడు తెలిపాడు. రోగి, ఆమె సోదరుడు శుక్రవారం భారత్ నుంచి మెల్బోర్న్కు బయలుదేరారు.