IND vs PAK: సెప్టెంబర్ 10న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుందా? డౌటే ?
సెప్టెంబర్ 2న పల్లెకెలెలో జరిగిన ఆసియా కప్‌లో రెండవ మ్యాచ్‌లో భారతదేశం - పాకిస్తాన్ మొదటిసారిగా తలపడినప్పుడు, అక్కడ ఒక ఇన్నింగ్స్ మాత్రమే జరిగింది. పాక్ ఇన్నింగ్స్ ఆడకుండానే మ్యాచ్ ముగిసింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. సెప్టెంబరు 10న కొలంబోలో కూడా ఇదే పరిస్థితి ఉండబోతోంది.
IND vs PAK: ఆసియా కప్ 2023లో భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన తొలి మ్యాచ్ ఇప్పటికే రద్దయింది. ఇప్పుడు మిగతా మ్యాచ్ ల పరిస్థితి కూడా అలాగే ఉంది. కొలంబోలో సెప్టెంబర్ 10న ఆసియాకప్‌లో జరిగే ఈ సూపర్ 4 మ్యాచ్ కు కూడా వర్షగండం పొంచి ఉంది. సెప్టెంబర్ 2న పల్లెకెలెలో జరిగిన ఆసియా కప్‌లో రెండవ మ్యాచ్‌లో భారతదేశం – పాకిస్తాన్ మొదటిసారిగా తలపడినప్పుడు, అక్కడ ఒక ఇన్నింగ్స్ మాత్రమే జరిగింది. పాక్ ఇన్నింగ్స్ ఆడకుండానే మ్యాచ్ ముగిసింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. సెప్టెంబరు 10న కొలంబోలో కూడా ఇదే పరిస్థితి ఉండబోతోంది.ఎందుకంటే ఆ రోజు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సమాచారం.
సెప్టెంబర్ 10 ఆదివారం కొలంబోలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ వెబ్సైట్ ప్రకారం, సెప్టెంబర్ 10 ఉదయం కొలంబోలో 70 శాతం వర్షం పడే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభం కానున్న సమయంలో వర్షం వల్ల ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఆకాశంలో నిరంతరం చీకటి మేఘాలు ఆవరించి ఉంటాయి. రాత్రి సమయంలో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మ్యాచ్ ఎలా జరుగుతుంది? ఇలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్స్మెన్లు కూడా ఏమీ చేయలేరా? ఫలితంగా, ఆసియా కప్ 2023లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య వరుసగా రెండో మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. అయితే కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాక్ మ్యాచ్‌పైనే వర్షం ముప్పు పొంచి ఉంది. ఇక్కడ జరగాల్సిన మరో రెండు భారత మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా ప్రభావితం కావచ్చు.
సెప్టెంబర్ 12న ఇక్కడ జరగనున్న భారత్-శ్రీలంక మ్యాచ్‌కి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఆ రోజు కొలంబోలో 40 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే సెప్టెంబర్ 15న బంగ్లాదేశ్‌తో భారత్ ఆడనున్న మ్యాచ్‌లో గత రోజుల కంటే వాతావరణం కాస్త తేలికగా ఉంటుంది.