Turtle boy: సగం మనిషిగా సగం జంతువుగా మారడం కథలు లేదా సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. రియల్ లైఫ్ లో అలాంటిదేమీ జరగదని మనకు బాగా తెలుసు. కానీ ఇది నిజంగానే జరిగింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ చిన్నారి తన వీపుపై తాబేలు పెంకులా ఉండే భిన్నమైన నిర్మాణంతో జన్మించాడు. అది చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. నిజానికి సాధారణం కంటే అధిక బరువుతో పుట్టిన శిశువులను చూశాం.. శరీరం నిండా వెంట్రుకలతో పుట్టిన చిన్నారి గురించి విన్నాం. తోకతో పుట్టిన బిడ్డ గురించి వార్తలు చదివాం.. ఈ చిన్నారి అందరి కంటే కూడా విచిత్రంగా జన్మించాడు. వీపుపై తాబేలు లాంటి పెంకుతో పుట్టాడు. అది చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు.
ఈ వింత కేసు అమెరికాలోని ఫ్లోరిడాలో వెలుగు చూసింది. ఆ చిన్నారి పేరు పేరు జేమ్స్ . ప్రస్తుతం తన వయసు 19 నెలలు. జేమ్స్ జన్మించినప్పుడు అరుదైన చర్మాన్ని కలిగి ఉన్నాడు. అతని వీపు భాగంలో 75 శాతం తాబేలు పెంకు వంటి నిర్మాణంతో కప్పబడి ఉంది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు స్కానింగ్‌లో అదేమీ కనిపించలేదు. చివరకు అతను పుట్టినప్పుడు, అతని వింత రూపాన్ని చూసి వైద్యులు, సిబ్బంది, తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు.
మొదట్లో పుట్టుమచ్చ అనుకున్నా.. చిన్నారి తల్లి
ఆ బాలుడి తల్లి తన కొడుకు వీపుపై ఉన్న దానిని పుట్టుమచ్చగా భావించింది. కానీ ఆ పరిమాణం క్రమంగా పెరిగింది. చివరకు అతడిని పరీక్షించి రిపోర్టు చూసి తల్లిదండ్రులు ఇద్దరూ షాక్ అయ్యారు. ఆ రిపోర్టులో బాలుడికి వెన్నుముకకు అరుదైన వ్యాధి ఉందని తేలింది. ఇది విన్న అతని తల్లిదండ్రులు నివ్వెరపోయారు. అయితే వైద్యుల సలహా మేరకు 2022లో చిన్నారి వీపుపై పెరుగుతున్న కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. కానీ ఇంకా ఒక శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. ఆ తర్వాతనే జేమ్స్ మామూలు మనిషి అవుతాడు. తాబేలులాంటి వీపు ఉండడంతో పుట్టిన తర్వాత వీపుపై పడుకోలేకపోయాడు.. కానీ ఇప్పుడు సర్జరీ తర్వాత ఈ సమస్య తీరి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు.