దేశంలోని ప్రముఖ నగరాలలో హైదరాబాద్ ఒకటి. ఇక్కడి స్వేచ్చాయుత వాయువులు ఎవరినైనా తమవారిగా భావించే ప్రజలు హైదరాబాద్ విశిష్టత. దీంతోపాటు.. మహిళలు స్వేచ్చగా జీవించడానికి అనువైన నగరాలలో హైదరాబాద్ కు గతంలోనే పలు సర్వేలలో మంచి ర్యాంకు వచ్చింది. మిగితా నగరాలలో అయితే మహిళలు అంత స్వేచ్చగా నడుచుకునే అవకాశం కన్వినెంట్ గా ఉండదు అనే విషయం పలు సర్వేలలో నిరూపితం అయింది. అంతే కాదు.. మిగితా మెట్రో నగరాలతో పోల్చితే హైదారాబాద్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. అలాంటి హైదరాబాద్ కు మరో ఘటత దక్కింది. దేశంలోని టాప్ హైస్ట్రీట్ లో హైదరాబాద్(hyderabad)కు రెండో స్థానం లభించింది. అందులోను ముఖ్యంగా సోమాజిగూడకు ఆ స్థానం దక్కింది.
దేశంలోనే మెరుగైన శాపింగ్ మాల్ అనుభూతిని ఇచ్చే అత్యత్తమ హైస్ట్రీట్ మార్కెట్ గా సోమాజిగూడకు రెండో స్థానం(second place) దక్కింది. మొదటి స్థానంలో బెంగళూరులోని మహాత్మాగాంధీ రోడ్డు నిలిచింది. ఈ సర్వేను ప్రముఖ రిలయ్ ఎస్టేట్ మార్కెట్ విశ్లేషణ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ బుధవారం తన నివేదికలో ప్రకటించింది. దేశంలోని ఏడు మెట్రో నగరాలలో సర్వే నిర్వహించింది. థింక్ ఇండియా ధింక్ రిటైల్ – 2023 హైస్ట్రీట్ రియల్ ఎస్టేట్ ఔట్ లుక్ పేరుతో చేసిన సర్వేలో ఈ రిపోర్ట్ ను వెళ్లడించింది.
హైదరాబాద్ నగరం డెవలప్ అవుతున్న కాలం నుంచి సోమాజీగూడ ముఖ్యమైన స్ట్రీట్ గానే ఉంది. అప్పట్లో అన్ని ముఖ్యమైన కార్యాలయాలు సోమాజీగూడాలోనే ఉండేవి. ఇప్పటికీ గవర్నర్ నిలయం సోమాజీగూడలోనే ఉండటం గమనార్హం. అయితే.. సోమాజీగూడ షాపింగ్ అంత్యంత అనుకూలంగా ఉందని రిపోర్ట్ వెళ్లడించింది.
ఇక్కడి వ్యాపారస్థులు కొనుగోలుదారులకు కల్పిస్తున్న వసతులు జనాలను ఆకట్టుకునే ఉన్నాయని తెలిపింది. పార్కింగ్ వసతులు, సౌకర్యాలతో పాటు రిటైల్ రంగంలో ఇటీవల పెరిగిన పోటీతత్వంతో ధరలు, సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కొనుగోలుదారులకు మంచి షాపింగ్ అనుభూతి కలిగించడం ఇందులో కీలకమని అలాంటి వాటినే హైస్ట్రీట్ వీధులుగా గుర్తిస్తారని నివేదిక తెలిపింది.