»How Parineeti Chopra Became Fat To Fit What Was Her Diet Follow This Tips
Parineeti Chopra : పరిణీతి చోప్రా 28కిలోల బరువు ఎలా తగ్గించుకుందో తెలుసా ?
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా నిన్న (మే 13) తన ప్రేమికుడు , ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వారు గతంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో తెలిసిందే.
Parineeti Chopra : బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా(Parineeti Chopra ) నిన్న (మే 13) తన ప్రేమికుడు , ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(MP Raghav Chadha)తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వారు గతంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో తెలిసిందే. వారివురి మధ్య ఏదో సంబంధం ఉందని వార్తలు గుప్పుమన్నాయి. వాటిని నిజం చేస్తూ ఇద్ధరు పెళ్లికి సిద్ధమయ్యారు. పరిణీతి చోప్రా పలు హిందీ చిత్రాల్లో నటించి.. మంచి పేరు తెచ్చుకున్నారు. సెలబ్రిటీ కాబట్టి ఆమె ప్రతి కదలికను అభిమానులు పసిగట్టే వారు. దీంతో కొద్ది రోజులు ఆమె పెద్ద పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమాల్లోకి రాకముందు ఆమె భారీ శరీరం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే సినిమాలకు రావాలనుకున్నారో ఆ సమయంలో తన బరువును 28 కిలోలకు తగ్గించుకుంది. ఆమె జీవనశైలి, ఆహారపు అలవాట్లు పాటిస్తే మనం కూడా ఆశించిన ఫలితాలు సాధించవచ్చు.
పరిణీతి బరువు ఎలా తగ్గింది?
– ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించకుండా మీరు ఫిట్(Fit)గా ఉండలేరు. పరిణీతి చోప్రా చాలా స్ట్రిక్ట్ డైట్(Diet) రొటీన్ ఫాలో అయ్యేది. ఆమె తనను తాను కొవ్వులు, అధిక పిండి పదార్థాలు, స్వీట్లకు దూరంగా ఉంచుకుంది. ఆమె ముఖ్యంగా పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ తినదు.
– పరిణీతి చోప్రా తన బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రౌన్ బ్రెడ్, వెన్న, గుడ్డు(Egg)లోని తెల్లసొన, ఒక గ్లాసు పాలు, తాజా పండ్ల రసం తీసుకుంటుంది. ఆరోగ్యకరమైన అల్పాహారం బరువును అదుపులో ఉంచుతుంది.
– పరిణీతి చోప్రా లంచ్‌లో బ్రౌన్ రైస్, బ్రెడ్, డాల్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడుతుంది. బరువు తగ్గడానికి తేలికపాటి ఆహారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
– పరిణీతి చోప్రా రాత్రి పడుకునే 4 గంటల ముందు భోజనం చేసేది. ఇందులో తక్కువ కొవ్వు పదార్థాలు, ఆకుపచ్చ కూరగాయలు, ఒక గ్లాసు పాలు ఉంటాయి.
– డైట్ కంట్రోల్‌తో పాటు వ్యాయామానికి కూడా ప్రాధాన్యత ఇస్తోంది పరిణీతి. ఆమె తరచుగా వ్యాయామశాలకు వెళ్తుంటుంది. నటి తన సోషల్ మీడియాలో వర్కౌట్ వీడియోలను కూడా పంచుకుంటుంది. ఆమె యోగా, ధ్యానానికి కూడా ప్రాధాన్యం ఇస్తుంది.