Ten people died in Road accident At Nashik-Shirdi highway
ప్రీవెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా నలుగురు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఇల్లెందు-మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రతకు కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని హాస్పిటల్ కు తరలించారు.
కారు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరిని హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులను కమలాపూర్‌కు చెందిన అరవింద్, వరంగల్‌కు చెందిన రాము, కల్యాణ్, శివగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని నర్సంపేటకు చెందిన రణధీర్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, వీరంతా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం భద్రాద్రి జిల్లా మోతె ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలుస్తున్నది..