ప్లేట్లో పంచభక్ష పరమాన్నాలు ఉన్నా ఆఖర్లో కచ్చితంగా గడ్డ పెరుగు ఉండాల్సిందే. తెలుగు భోజనం పూర్తయ్యేది పెరుగన్నంతో మాత్రమే. చాలామంది పెరుగుతో ఓ ముద్ద ఎక్కువే తింటారు. కొందరైతే పెరుగులో కొంచెం చక్కెర కలుపుకొని ఇష్టంగా తింటారు.
Curd : ప్లేట్లో పంచభక్ష పరమాన్నాలు ఉన్నా ఆఖర్లో కచ్చితంగా గడ్డ పెరుగు ఉండాల్సిందే. తెలుగు భోజనం పూర్తయ్యేది పెరుగన్నంతో మాత్రమే. చాలామంది పెరుగుతో ఓ ముద్ద ఎక్కువే తింటారు. కొందరైతే పెరుగులో కొంచెం చక్కెర కలుపుకొని ఇష్టంగా తింటారు. ఇది ఒంటికి చాలా మంచిది కూడా. లస్సీ, మజ్జిగలా మార్చి కొంతమంది తాగుతారు. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని ప్రోబయోటిక్స్ జీర్ణశక్తిని మెరుగు పరుస్తాయి. పెరుగు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది.పెరుగు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. దానితో కలిపి తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి.
పాలతో కలిపి పెరుగు తాగకూడదు
పెరుగు వచ్చేది పాల నుంచే కదా..అవి రెండూ కలిపి తింటే అరగకపోవడమేంటి అనుకోకండి. రెండు విడివిడిగా తింటే రెండూ మంచివే. కానీ.. పాలు, పెరుగు కలిపి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. పెరుగు ఎక్కువ కాలం ఉంటే పులిసిపోతుంది. కానీ పాలు పులిసిపోవు. ఈ రెండింటినీ కలిపి తింటే ఎసిడిటీ, అతిసారం, కడుపునొప్పి, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
పెరుగులో ఉల్లిపాయ తినకూడదు
పెరుగు తినేటప్పుడు చాలామంది ఉల్లిపాయ నంజుకొని తింటారు. పెరుగులో ఉల్లిగడ్డ నంజుకొని తింటుంటే రుచి ఓ రేంజ్ లో ఉంటుందని భావిస్తారు. రుచి ఏ రేంజ్ లో ఉంటుందో.. ఆరోగ్యానికి ముప్పు కూడా అంతే ఉంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అదేంటీ.. అనుకుంటున్నారా. ఆయుర్వేదంలో ఈ విషయం చాలా క్లియర్ గా చెప్పారు. పెరుగులో ఉల్లిపాయ కలిపి తింటే అలర్జీలు వస్తాయి. దద్దుర్లు, తామర, సోరియాసిస్, గ్యాస్ట్రిక్, వాంతి వంటి ఇబ్బందులు వస్తాయని ఆయుర్వేదంలో ఉంది. పెరుగు తినడం వల్ల బాడీలో చల్లదనం పెరుగుతుంది. ఉల్లి తింటే వేడి పెరుగుతుంది. రెండూ కలిపి తినడం వల్ల జీవక్రియలు గతి తప్పి చర్మం మీద ఆ ప్రభావం పడుతుంది.
చేపలతో కలిపి తినకూడదు
పెరుగుతో కలిపి చేపలు తింటుంటే.. వద్దంటూ పెద్దలు వారిస్తారు. ఎందుకంటే రెండింటిలోనూ మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండూ ఒకేసారి తింటే మంచిది కాదని ఆయుర్వేదం చెప్తుంది. రెండు అధిక ప్రొటీన్లు ఉన్న పదార్థాలు తీసుకుంటే చర్మ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఆహార నిపుణులు.
నూనెతో చేసినవి అస్సలే వద్దు
పెరుగుతో భోజనం చేసినా.. పెరుగు తిన్నా వెంటనే నూనెతో చేసిన వస్తువులు, నెయ్యి కలిపిన పదార్థాలు తినొద్దు. మినపపప్పుతో చేసిన ఫుడ్ జోలికి అస్సలే పోవద్దు. ఎందుకంటే తిన్న వెంటనే కొద్దిసేపటికే దాన్ని జీర్ణం చేసే పనిలో పెరుగు రంగంలోకి దిగుతుంది. అయితే.. పెరుగుతో తిన్న తర్వాత ఇవి తింటే.. జీర్ణవ్యవస్థ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా మలబద్ధకం, జీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు తప్పవు.
మామిడిపండుతో అస్సలు వద్దు..
ఈ రెండు కాంబినేషన్లు చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఎర్రగా, బంగారు రంగులో మెరిసిపోయే తియ్యటి మామిడి పండు, తెల్లటి గడ్డ పెరుగు రెండూ కలిపి తింటే ఆ రుచికి నాలుకకు పండుగే. అయితే.. మామిడి పండు, పెరుగు కలిపి తింటే శరీరంలో విషపు టాక్సిన్లు విడుదలవుతాయి. ఫలితంగా ఆరోగ్యసమస్యలు మొదలవుతాయి.