»Another Big Bank Closure Another Jolt In The Financial Sector
America Bank: మరో అతి పెద్ద బ్యాంకు మూత..ఆర్థిక రంగంలో మరో కుదుపు!
ఇప్పటి వరకూ అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు, సిగ్నేచర్ బ్యాంకులు ఆర్థికంగా పతనం అయ్యి మూతపడ్డాయి. తొలి రెండు బ్యాంకుల ప్రభావం వల్ల మూడో బ్యాంకుకు తీవ్ర ఒత్తిడి ఎదురైంది.
అమెరికా(America)లో ఆర్థిక రంగ పరిస్థితి సన్నగిల్లుతోంది. దీంతో ఆ దేశానికి చెందిన 14వ అతి పెద్ద బ్యాంకు మూతపడటం కలకలం రేపింది. ఇది బ్యాంకింగ్ రంగంలోనే మరో కుదుపుగా నిపుణులు భావిస్తున్నారు. ఆర్థికంగా పతనమైన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు(First Republic Bank)ను జేపీ మోర్గాన్ ఛేస్ సంస్థ(JP Morgan Ches) చేజిక్కించుకుంది. ఈ విషయాన్ని అమెరికా నియంత్రణ సంస్థలు తెలిపాయి. అమెరికాలో రెండు నెలల వ్యవధిలోనే మూడు బ్యాంకులు మూతపడ్డాయి.
ఇప్పటి వరకూ అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు, సిగ్నేచర్ బ్యాంకులు ఆర్థికంగా పతనం అయ్యి మూతపడ్డాయి. తొలి రెండు బ్యాంకుల ప్రభావం వల్ల మూడో బ్యాంకుకు తీవ్ర ఒత్తిడి ఎదురైంది. దీంతో ఇన్వెస్టర్లు, ఖాతాదారులు డిపాజిటర్లకు భరోసా ఉండదనే నమ్మకంతో ఆందోళన చేపట్టారు. బ్యాంకు వడ్డీ రేట్లు కూడా అత్యంత తక్కువగా ఉండటంతో ఆందోళన తీవ్రతరమైంది.
సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు ప్రారంభం అయ్యేందుకు ముందే ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు(First Republic Bank) మూత గురించి సమాచారం అందింది. ఆఖరికి ఆ బ్యాంకును జేపీ మోర్గాన్ ఛేస్(JP Morgan Ches Bank) బ్యాంకులో విలీనం చేయనున్నట్లు ప్రకటించింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు(First Republic Bank)కు అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాల్లో 84 బ్యాంచ్లు ఉన్నాయి. సోమవారం నుంచి ఆ బ్యాంచులన్నీ జేపీ మోర్గాన్ ఛేస్ బ్యాంకు శాఖలుగా పనిచేయనున్నట్లు అమెరికా ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వెల్లడించింది.