బీఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమావేశంలో వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో అందరి ఎదుటే.. ఒక నేతపై మరో నేత అరవడం హాట్ టాపిక్ గా మారింది. నేడు మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించగా… మాజీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
మహబూబాబాద్ జిల్లా గూడూరులో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మెళనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, పలువురు నేతలు పాల్గొన్నారు. అయితే ఈ సభలో మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ మాట్లాడుతుండగా మధ్యలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కల్పించుకున్నారు. అంతే.. మాజీ ఎంపీ ఆగ్రహంతో ఊగిపోయాడు.
మంత్రి ఎదురుగానే… ఎమ్మెల్యేకి చేరకలు అంటించాడు. రెండు నిమిషాలు ఓపిక పట్టలేవా.. నోరే గట్లనా అంటూ అరిచేశాడు. పెద్దవారు మాట్లాడేప్పుడు ప్రోటోకాల్ పాటించడం రాదా అంటూ సీరియస్ అయ్యారు. ప్రతి దాంట్లో ఏదో ఒకటి చేస్తావంటూ భగ్గుమన్నారు. మనిద్దరిది ఐదేళ్ల స్నేహమని.. గత ఐదేళ్లలో తాను 24 గంటలూ కాపాడుతూ వచ్చానని సీతారామ్ నాయక్ అన్నారు.