W.G: భీమవరం ప్రాంతంలో రోడ్లపై తిరిగే ఆవులకు లంపి వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతోందని, ఇది ఒక ఆవు నుంచి మరొక ఆవుకు అంటువ్యాధిగా సోకుతోందని గో సంరక్షణ అధ్యక్షులు సుంకర దాసు తెలిపారు. శుక్రవారం భీమవరంలో లంపి వైరస్‌తో బాధపడుతున్న ఆవు దూడకు ఆయుర్వేద మందులతో చికిత్స అందించారు. మెథిలిన్ బ్లూ పౌడర్‌ను నీటిలో కలిపి దూడకు స్ప్రే చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.