కొంతమంది ఫేషియల్ హెయిర్‌తో ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారు రకరకాల చిట్కాలు పాటిస్తారు. గోధుమపిండికి పావుచెంచా పసుపు, కాస్త వెన్న లేదా నెయ్యి, తగినన్ని పాలు కలిపి ముద్దలా చేసుకుని దానితో ముఖంపై మర్దనా చేస్తారు. గోధుమపిండి, పసుపు స్క్రబ్‌లా పనిచేసి, అవాంఛిత రోమాలను తొలగిస్తాయి. అయితే సున్నిత చర్మం కలవారు తరచూ ఇలా చేస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దురద, అలర్జీ, యాక్నే మరింత పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.