AP: విజయవాడలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వమే దేశ ప్రగతికి మూలమని పేర్కొన్నారు. మతం, కులం, జాతి, వర్ణం కంటే మానవత్వం చాలా ముఖ్యమైందని.. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగడమే నిజమైన లౌకికత్వమని అభిప్రాయపడ్డారు.