మీడియా రంగంలో అతిపెద్ద విలీనం జరిగింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, అంతర్జాతీయ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీకి చెందిన మీడియా వ్యాపారాల విలీనం ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తయింది. దీంతో రూ.70,353 కోట్ల విలువతో దేశంలోనే అతిపెద్ద మీడియా సామ్రాజ్యంగా ఏర్పడింది. ఈ సంస్థకు ముకేశ్ నీతా అంబానీ ఛైర్పర్సన్గా, ఉదయ్ శంకర్ వైస్ ఛైర్పర్సన్గా వ్యవహరించనున్నారు.