VZM: రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ది శాఖ అదనపు కమిషనర్ ఎం.శివ ప్రసాద్ గురువారం జిల్లాలో పర్యటించి ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పల్లె పండుగ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అంబేద్కర్ను కలిసి జిల్లాలో పల్లె పండుగ పనులు జరుగుతున్న తీరుపై చర్చించారు. అనంతరం కలెక్టర్ ఆయనను సత్కరించారు.