KRNL: జిల్లాలో మోసాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రూ.15 లక్షలు ఇస్తే సెంట్రల్ ఫండ్ నుండి రూ.20 కోట్లు అప్పుగా ఇప్పిస్తామని నమ్మబలికి మోసానికి పాల్పడ్డారని తెలిపారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు 12 గంటలలోపే నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు.