VZM: బొబ్బిలి పట్టణంలోని అండర్ గ్రౌండ్ అప్రోచ్ రోడ్డులో మోకాలి లోతులో చేరిన వర్షం నీటిని మల్లించే ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మువ్వల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం నీటిలో దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మోటారు పెట్టి మల్లించే ఏర్పాట్లు చేసేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు.