AP: పులివెందుల క్యాంపు కార్యాలయంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటుచేసుంది. వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. జగన్ను చూసేందుకు ఒక్కసారిగా ప్రజలు ఎగబడ్డారు. దీంతో ప్రజల మధ్య తోపులాట జరగటంతో కార్యాలయం అద్దాలు పగిలాయి. కార్యకర్తలను కంట్రోల్ చేయలేక పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు.