VZM: ఉత్తమ రాజకీయవేత్తగా ఎంపిక కాబడిన గజపతినగరం జెడ్పీటీసీ గార తవుడుకి విశాఖకు చెందిన పైడిమాంబ ఫైన్ ఆర్ట్స్ ప్రతినిధులు గురువారం వైసీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందజేశారు. ఉత్తమ రాజకీయవేత్తగా నాలుగోసారి పురస్కారాన్ని తవుడు అందుకున్నారు.