ఇతర ప్రజాస్వామ్యాలకు భిన్నంగా భారత్లో లోక్సభ ఎన్నికలు జరిగినట్లు ఈసీ తెలిపింది. గత ఎన్నికల్లో 64.64 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొంది. ఈ మేరకు గణాంక వివరాలను వెల్లడించింది. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటింగ్లో పాల్గొన్నారని చెప్పింది. ఈ ఎన్నికల్లో 800 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారని స్పష్టం చేసింది.