ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ చరిత్ర సృష్టించాడు.18ఏళ్ల వయసులో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అతను నిలిచాడు. ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా రికార్డుకెక్కాడు. తాజాగా గుకేశ్.. సూపర్ స్టార్ రజినీకాంత్, శివకార్తికేయన్‌ను కలిశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను గుకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి.