VZM: జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఎస్.శారదాదేవి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆమె జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. శారదాదేవి ఎస్.కోట అదనపు పీడీగా విధులను నిర్వహిస్తూ, పీడీగా నియమితులయ్యారు.