AP: కూటమి ప్రభుత్వం కరెంట్ ఛార్జీల విషయంలో బాదుడే బాదుడే అనే విధంగా తయారైందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే మాట తప్పారని ధ్వజమెత్తారు. 6నెలల్లో రూ.15,485 కోట్ల మేరా ప్రజలపై విద్యుత్ భారం పడిందని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉన్నాయని ఆగ్రహించారు.