TG: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును పార్టీ నేతలు ఖండించారు. ఈ క్రమంలో మాజీమంత్రి కేటీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా శ్రీనివాస్‌ను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. నిర్బంధం, అణచివేతతో BRS గొంతునొక్కలేరని స్పష్టం చేశారు.